Tuesday, October 22, 2024
Google search engine
HomeUncategorizedPremi Viswanath: కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో అతడు చాలా...

Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో అతడు చాలా ఫేమస్.. ఫోటోస్ వైరల్..

బుల్లితెరపై దాదాపు 7 సంవత్సరాల వరకు అగ్రస్థానంలో దూసుకుపోయిన సీరియల్ కార్తీక దీపం. మొదటి రోజు నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఈ సిరీయల్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కార్తీక దీపం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత. ఈ సీరియల్ ద్వారా తెలుగు ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రేమి విశ్వనాథన్. వంటలక్కగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయ్యింది ఈ కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్ పూర్తికాగా.. కార్తీక దీపం 2 సీరియల్ నడుస్తోంది. ఇందులో మరోసారి డాక్టర్ బాబు, వంటలక్క అలరిస్తున్నారు. తెలుగు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కరికీ దీప గురించి తెలుసు. ప్రేమి విశ్వనాథ్ కొడుకు ఫోటోస్ ఇటీవలే నెట్టింట వైరలయ్యాయి.

వంటలక్క కొడుకు పేరు మను.. జిమ్ ట్రైనర్ గా వర్క్ చేస్తున్నాడు. ప్రేమి విశ్వనాథన్ ఫోటోస్, వీడియోస్ నెట్టింట తెగ చక్కర్లు కొట్టగా.. వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా ? ఇద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్ లా ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. ఇక ప్రేమి విశ్వనాథన్ భర్త గురించి చాలా మందికి తెలియదు. కానీ ఇండస్ట్రీలో అతడు కూడా చాలా ఫేమస్. దేశ వ్యాప్తంగా చాలా పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తి అనే విషయం కొంత మందికే తెలుసు. ప్రేమి విశ్వనాథ్ భర్ డాక్టర్ వినీత్ భట్ ప్రముఖ జ్యోతిష్య నిపుణులు.

2017లో వరల్డ్ బెస్ట్ ఆస్ట్రాలజర్ గా గుర్తింపు పొందారు. అలాగే మలయాళీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈరోజు నటిగా తాను మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం తన భర్త వినీత్ అని చాలాసార్లు చెప్పుకొచ్చారు ప్రేమి విశ్వనాథ్. అంతేకాదు తన భర్త సహకారం లేకపోతే నటిగా జర్నీ కొనసాగేది కాదని తెలిపారు. తెలుగు కంటే ముందు మలయాళంలో పలు సీరియల్స్ చేశారు. తెలుగులో కస్టడీ సినిమాలో కీలకపాత్రలు నటించింది ప్రేమి విశ్వనాథ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments