Sunday, November 24, 2024
Google search engine
HomeUncategorizedAnant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధికల పెళ్లిపై విషం కక్కిన పాకిస్తాన్ నటుడు.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు

Anant Ambani Wedding: అనంత్ అంబానీ-రాధికల పెళ్లిపై విషం కక్కిన పాకిస్తాన్ నటుడు.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు

అపరకుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. జులై 12న రాధిక మర్చంట్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు అనంత్ అంబానీ. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు జరిగిన అంబానీల పెళ్లి వేడుకలకు దేశ, విదేశాలకు చెందిన అతిరథ మహారథులు తరలివచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరూ ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు తరలివచ్చారు. నూతన దంపతులను మనసారా అశీర్వదించారు. తమ స్థోమతకు తగ్గట్టుగా ఈ పెళ్లి వేడుక అందరికీ జీవితాంతం గుర్తుండి పోయేలా జరిపించారు ముఖేష్ అంబానీ- నీతా దంపతులు. త్వరలో అనంత్ అంబానీ- రాధిక దంపతులు లండన్ కు హనీమూన్ కు వెళ్లనున్నారని, అక్కడే పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ప్రపంచ మంతా అనంత్ అంబానీల పెళ్లి వేడుక గురించి మాట్లాడుతుంటే పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటుడు మాత్రం అక్కసు వెళ్లగక్కాడు. సోషల్ మీడియాలో అనంత్, రాధికల పెళ్లి ఫొటోలను షేర్ చేస్తూ సెటైర్లు వేశాడు. వీటిని చూసిన నెటిజన్లు సదరు పాకిస్తాన్ నటుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ నటుడు అర్సలన్ నజీర్ అనంత్ అంబానీ, రాధిక ల వివాహం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా ఓ సంచలన పోస్ట్ షేర్ చేశాడు. ‘ఈరోజుల్లో వివాహ వేడుకలు ఎంతో ఆడంబరంగా చేసుకుంటున్నప్పటికీ…. కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడడం లేదు’ అంటూ అనంత్, రాధికల ఫోటోలు షేర్ చేశాడు. ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్లు అర్సలన్ నజీర్ తీరుపై మండిపడుతున్నారు. ‘ వారు ఎంతో ప్రేమతో.. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తావా’? అని పాక్ నటుడిపై మండి పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

‘అనంత్ అంబానీ, రాధికలు చిన్న నాటి స్నేహితులు. వారి ప్రేమలో ఎంతో నిజాయతీ ఉంది. ఇప్పుడు వారి బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. వారు జీవితాంతం కలిసి ఉంటారు. అయినా వారి మధ్యలో నీకెంటి సమస్య’ అంటూ అర్సలన్ నజీర్ ను ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం అతని పోస్ట్ తో పాటు నెటిజన్ల కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments