బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుల్షన్ దేవయ్య. ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ ఉలఝ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక నిన్న ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా గుల్షన్ దేవయ్య రెడిట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి గుల్షన్ దేవయ్యను ప్రశ్నిస్తూ.. మొదట్లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలా అనిపించింది.. అలాగే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ? అంటూ ప్రశ్నించాడు. దీనిపై గుల్షన్ చాలా క్రేజీగా బోరింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తన ఆన్సర్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు.
ఇంతకీ గుల్షన్ ఏం ఆన్సరిచ్చారంటే! “చాలా బోరింగ్ గా అనిపించేది.. ఇప్పుడు కూడా అలాగే బోరింగ్ అనిపిస్తుంది. కానీ అలాంటి సీన్స్ చూస్తూ మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తారుగా ” అంటూ ఆన్సర్ ఇచ్చారు ఈయన. ఆన్సర్ ఇవ్వడమే కాదు.. తన ఆన్సర్ తో ఇంటర్వ్యూలో అందర్నీ నవ్వించేశాడు. ఇక గతంలో హంటర్ లాంటి సినిమాల్లో గుల్షన్ రొమాంటిక్ సీన్స్ లో నటించాడు. అలాగే గతంలో ఓటీటీలో అఫ్సోస్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రెండో సీజన్ ఉంటుందా ? అని మరో అభిమాని అడగ్గా.. దాని గురించి మర్చిపోండి అంటూ సింపుల్ గా చెప్పేశాడు. మరో నటుడి సినిమా ఏదైనా మీరు చేసి ఉంటే బాగుండేదా అని అడగ్గా.. అందాధున్ అని అన్నారు. ఇప్పుడు తన ఈ క్రేజీ మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.