Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedS. S. Rajamouli: రాజమౌళి పిలిచి హీరో ఛాన్స్‌ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరో..

S. S. Rajamouli: రాజమౌళి పిలిచి హీరో ఛాన్స్‌ ఇస్తే నో చెప్పిన స్టార్ హీరో..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంటుంది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతోఅలరిస్తున్నారు. ప్రభాస్ హీరోగా ఆయన చేసిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాలహవా బహుబాలి సినిమా సినిమాతోనే మొదలైంది. బాహుబలి సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచేసింది. ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంచలన విజయం సాధించింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి బడా హీరోలతో భారీ మల్టీస్టారర్ మూవీ చేసి హాలీవుడ్ దర్శకులు కూడా షాక్ అయ్యేలా చేశాడు జక్కన్న.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

ఆర్ఆర్ఆర్ సినిమా మనదేశంలోనే కాదు జపాన్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. అక్కడ కూడా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా.? చిన్న పాత్ర అయినా చేయడానికి రెడీగా ఉంటారు సినీ తారలు కానీ ఓ స్టార్ హీరో మాత్రం రాజమౌళి సినిమాకు నో చెప్పాడట. ఆ హీరో ఎవరో కాదు తమిళ్ క్రేజీ హీరో సూర్య. రాజమౌళితెరకెక్కించిన సినిమాలో సూర్యకు సెకండ్ హీరోగా ఆఫర్ ఇచ్చాడట రాజమౌళి కానీ ఆ ఆఫర్ ను సూర్య రిజక్ట్ చేశారు. ఆ సినిమానే సై. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో సెకండ్ హీరోగా సూర్యను అనుకున్నాడట జక్కన్న. కానీ సెకండ్ హీరో రోల్ కావడంతో సూర్య నో చెప్పారట. హీరోగా ఎదుగుతున్న సూర్య ఆ టైం లో సెకండ్ హీరోగా చేస్తే ఆతర్వాత హీరో ఛాన్స్ లు వస్తాయో రావో అనే అనుమానంతో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఆతర్వాత సై సినిమాలో అదే పాత్ర శశాంక్ చేశాడు. సై సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments