Ezhumalai: కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!

0
30
కార్తి ‘సర్దార్ 2’ షూటింగ్‌లో ప్రమాదం.. ఫైట్ మాస్టర్ మృతి.!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్ 2. పీఎస్‌ మిత్రన్ దర్శకత్వంలో గతంలో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఇటీవలే చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను పట్టాలెక్కించారు. జులై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ప్రముఖ ఫైట్ మాస్టర్ కన్నుమూసినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తోన్న క్రమంలో ఎజుమలై అనే ఫైట్‌ మాస్టర్‌ సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడ్డాడు. వెంటనే స్పందించిన చిత్రబృందం అతనిని ఆస్పత్రికి తరలించింది. అయితే అంత ఎత్తు నుంచి కిందపడటం వల్ల ఛాతీ భాగంలో తీవ్ర గాయం, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడంతో ఎజుమలై మృతి చెందాడని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అంతేకాదు ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటననకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు ఈ ప్రమాద ఘటనతో షూటింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై హీరో కార్తీక్, దర్శకుడు పీఎస్ మిత్రన్ నుండి ఎటువంటి అఫీషియల్ ప్రకటన అయితే వెలువడలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here