Prosenjit Chatterjee: సెట్‏లో హీరోయిన్ చెంప పగలగొట్టిన హీరో.. అసలు ఏం జరిగిందంటే..

0
52
Prosenjit Chatterjee, Sharm

సాధారణంగా సినీ పరిశ్రమలో షూటింగ్స్ జరుపుతున్నప్పుడు విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటారు నటీనటులు. అభిమానుల నుంచి చాలాసార్లు చేదు అనుభవాలు ఎదురవుతాయి. మరికొన్నిసార్లు స్టార్ నటీనటుల మధ్య మనస్పర్థలు తలెత్తే ఘటనలు జరుగుతాయి. అయితే తమకు జరిగిన కొన్ని ఇన్సిడెన్స్ మాత్రం కొందరు అసలు మర్చిపోలేరు. ఎన్ని సంవత్సరాలైన ఆ ఘటన తాలుకూ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. తాజాగా బెంగాళీ నటుడు ప్రొసెన్ జిత్ కూడా తన చిన్నతనంలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ చూసి దిగ్గజ హీరోయిన్ ను చెంపదెబ్బ కొట్టినట్లు తెలిపారు. బెంగాలీ నటుడు ప్రొసెన్‏జిత్ ఛటర్జీ ప్రస్తుతం తన కొత్త సినిమా అజోగ్యో ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ప్రొసెన్‏జిత్ తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకున్నారు. గతంలో దిగ్గజ నటి షర్మిలా ఠాగూర్‏ను సెట్‏లో అందరి ముందు చెంప చెళ్లుమనిపించానని అన్నారు. తాను చిన్నవయసులో తండ్రి నటుడు బిస్వజీత్ ఛటర్జీతో కలిసి అనేక సినిమా షూటింగ్స్ సెట్స్‏కు వెళ్లేవాడినని అన్నారు. ఈ క్రమంలోనే అనుకోకుండా నటి షర్మిలా ఠాగూర్ చెంపపై కొట్టినట్లు గుర్తుచేసుకున్నారు. “నేను నాలుగైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా నాన్నతో కలిసి సినిమా షూటింగ్ సెట్ లోకి వెళ్లాను. అప్పుడు హీరోహీరోయిన్స్ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ లో భాగంగా దిగ్గజ నటి షర్మిల మా నాన్నను చెంపదెబ్బ కొట్టడం చూశారు. ఆ తర్వాత లంచ్ చేస్తున్న సమయంలో ఆమె నన్ను పిలిచి తన ఒడిలో కూర్చుబెట్టుకున్నారు. అప్పుడు నేను ఆమెను ఒక్కసారిగా చెంపదెబ్బ కొట్టాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటికీ తాను కనిపిస్తే నటి షర్మిల మాట్లాడుతూ.. “ఆ రోజు మీ నాన్ను కొట్టినందుకు నువ్వు నన్ను చెంపదెబ్బ కొట్టావు కదా.. నాకు ఆ సంఘటన ఇంకా గుర్తుంది” అని అంటారని నవ్వుతూ అన్నారు ప్రొసెన్‏జిత్ ఛటర్జీ. కాగా బిస్వజిత్ ఛటర్జీ.. షర్మిల ఠాగూర్ కలిసి ప్రభాతెర్ రంగ్, యె రాత్ ఫిర్ నా ఆయేగి చిత్రాల్లో నటించారు. ఇక ప్రొసెన్‏జిత్ ఛటర్జీ విషయానికి వస్తే.. బెంగాలీ చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోయిన్ రితుపర్ణ సేన్ గుప్తతో కలిసి దాదాపు 50 సినిమాల్లో నటించారు. వీరిద్దరిని అభిమానులు గోల్డెన్ కపుల్ అని పిలుచుకుంటారు.

Prosenjit Chatterjee, Sharm

Prosenjit Chatterjee, Sharm

ఇటీవలే వీరు అజోగ్యో మూవీలో జంటగా నటించారు. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రానికి కౌశిక్ గంగూలీ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రొసెన్‏జిత్ ఛటర్జీ చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here