Friday, December 27, 2024
Google search engine
HomeUncategorizedరూ.200తో కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు కోట్లు అందుకుంటున్నాడు.. పైగా స్టార్ హీరోయిన్ భార్య

రూ.200తో కెరీర్ మొదలుపెట్టి.. ఇప్పుడు కోట్లు అందుకుంటున్నాడు.. పైగా స్టార్ హీరోయిన్ భార్య

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో కష్టపడి వచ్చిన వారు ఉన్నారు. స్టార్ కిడ్స్ కూడా అందుకోలేని క్రేజ్ ను తమ టాలెంట్ తో అందుకోను సత్తా చాటుతున్నారు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికి కొంతమంది హీరోలు తాము పడిన కష్టాలను గుర్తు చేసుకుంటుంటారు. కెరీర్ బిగినింగ్ లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ .. తిని తినక డైరెక్టర్స్ దగ్గర పని చేసి ఆతర్వాత చిన్న చిన్నరొల్స్ చేసి ఆతర్వాత హీరోలుగా మారి ఇప్పుడు స్టార్ హీరోల స్థాయిని అందుకున్నవారు చాలామందే ఉన్నారు. చిరంజీవి, రవితేజ, నాని ఇలా చాలా మంది హీరోలు ఎంతోమంది అప్ కమింగ్ హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తాజాగా ఓ హీరో కూడా తన స్టార్టింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నాడు. కేవలం 200 రూపాయిలు జీతం తీసుకొని పని చేశాడట ఈ హీరో.. ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. అంతే కాదు ఓ స్టార్ హీరోయిన్ ను పెళ్లి కూడా చేసుకున్నాడు.

విక్కీ కౌశల్ బాలీవుడ్‌లో డిమాండ్ ఉన్న హీరోగా ఎదుగుతున్నాడు. అతనికి ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ‘ఉరి’, ‘సంజు’ సినిమాలు అతని జీవితాన్ని మార్చేశాయి. ఇప్పుడు ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ వారంలో సినిమా విడుదలవుతోంది. విక్కీ కౌశల్ సినీ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయన తాజాగా పంచుకున్నారు. ‘బ్యాడ్ న్యూస్’ సినిమా ప్రమోషన్ సందర్భంగా విక్కీ మాట్లాడుతూ..

విక్కీ కౌశల్ ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా అతని సినీ జీవితం మొదలైంది. యాక్షన్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ కొడుకు అయినప్పటికీ విక్కీ ప్రయాణం అంత ఈజీ కాలేదు. కెరీర్ బిగినింగ్ లో పాత్ర కోసం 200-300 రూపాయలు డిమాండ్ చేశాడట విక్కీ. ‘నాకు ఇప్పటికీ గుర్తుంది, నేను చిన్న చిన్న పాత్రలు రూ.200-300 అడిగేవాడిని. నేను ఇప్పుడు ఉన్న స్థితికి ఎప్పటికీ కృతజ్ఞుడను. 10-12 ఏళ్ల క్రితం ఎవరైనా వచ్చి మీ పాట హిట్ అవుతుందని, మీకు కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ వస్తుందని చెబితే కచ్చితంగా నవ్వుకునేవాడిని. ఎందుకు జోక్ చేస్తున్నావ్ అని అడిగేవాడిని.. దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీస్సులతో ఇక్కడివరకు వచ్చాను’ అని తెలిపారు. ‘నాకు వచ్చిన అవకాశానికి నేను కృతజ్ఞుడను. ఇంతకంటే మంచి అనుభూతి మరొకటి ఉండదు. నేను కలర్ లైఫ్‌లో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఎక్కడికి వెళ్లాలో నాకు తెలియదు. కానీ నేను ఎప్పుడూ ఆశ వదులుకోలేదు. భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, అందుకే నాకు ఈ పని దొరికింది అని అన్నారు. విక్కీ కౌశల్ ఇటీవలే చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ‘మాసన్’ ఆయన నటుడిగా తొలి చిత్రం. దేని పై ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేక పోస్ట్‌ చేశారు. విక్కీ కౌశల్ నటించిన ‘బ్యాడ్ న్యూస్’ త్వరలో విడుదల కానుంది. ‘బ్యాడ్ న్యూస్’ సినిమాలోని ‘తోబా తోబా..’ పాట విపరీతంగా పాపులర్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments