Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedSiddhant Karnick: 'ఆయన ఆ టైమ్‌లో గదికి రమ్మన్నాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన...

Siddhant Karnick: ‘ఆయన ఆ టైమ్‌లో గదికి రమ్మన్నాడు’.. క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన యానిమల్ నటుడు

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కారణంగా వేధింపులకు గురైన నటీమణులు ఎందరో ఉన్నారు. అయితే నటీమణులకే కాదు కొందరు నటులకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇటీవలే కొందరు యాక్టర్లు ఈ విషయంపై మాట్లాడేందుకు ధైర్యంగా ముందుకొస్తున్నారు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ విషయంపై ‘యానిమల్’ సినిమా నటుడు సిద్ధాంత్ కార్నిక్ కూడా స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు బయట పెట్టారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినేనన్న సిద్ధాంత్ కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నాడు. సిద్ధాంత్ కర్ణిక్ వయసు ఇప్పుడు 41 ఏళ్లు. అతను కెరీర్ ప్రారంభంలో టెలివిజన్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి అతనికి ఎవరూ గాడ్ ఫాదర్ లేరు.

‘అది 2005. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. నేను సినిమా ఇండస్ట్రీలోకి అప్పుడే అడుగుపెట్టాను. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్‌ని కలిశా. అతను నా వివరాలన్నింటినీ తీసుకుని రాత్రి 10.30 గంటలకు ఇంటికి రమ్మని చెప్పాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ఇంట్లోని ఫొటోలు, వాతావరణం చూశాక అది సేఫ్ ప్లేస్ గానే అనిపించింది. కానీ అతను మెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు. అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించాను. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్‌ లేదని చెప్పి బయటకొచ్చేశాను. నా కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు. కానీ వాటన్నింటికీ భయపడకుండా బయటకు వచ్చాను’ అని చెప్పుకొచ్చాడు సిద్ధాంత్ కార్నిక్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

సిద్ధాంత్ కార్నిక్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ వీడియో..

సిద్ధాంత్ కార్నిక్ కెరీర్ లో 2023 మర్చిపోని సంవత్సరం. గతేడాది రిలీజైన ‘ఆదిపురుష’ సినిమాలో విభీషణుడి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు సిద్ధాంత్ కార్నిక్ . ఆ తర్వాత విడుదలైన ‘యానిమల్’ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను దక్కించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments