Kiran Abbavaram: శబాష్ కిరణ్ అబ్బవరం..! నా స్థాయి పెద్దదా.. చిన్నదా అన్నది కాదు.. కంటెంట్‌పై నమ్మకం..

0
17
Kiran Abbavaram: శబాష్ కిరణ్ అబ్బవరం..! నా స్థాయి పెద్దదా.. చిన్నదా అన్నది కాదు.. కంటెంట్‌పై నమ్మకం..

టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోగా మారాడు ఈ కుర్ర హీరో.. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు పలు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. వాటిలో కిరణ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా మారి రాజావారు రాణిగారు సినిమా చేశాడు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ సినిమాలో తన నేచురల్ యాక్టింగ్ తో కిరణ్ ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కిరణ్ ఇప్పుడు ‘క’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ‘క’ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..!! హేమ కూతుర్ని చూశారా..? ఆమె అందం ముందు హీరోయిన్స్ కూడా పనికిరారు

ఈ టీజర్ విడుదల సందర్భంగా మీడియా ప్రశ్నలకు హీరో , దర్శకుడు సమాధానం చెప్పారు. కాగా ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కిరణ్ అబ్బవరం అదిరిపోయే సమాధానం చెప్పాడు. ప్రస్తుతం పెద్ద హీరోలే పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. మరికొంతమంది స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ లాంటి వారు పాన్ ఇండియా సినిమాల చేయడం లేదు.. మీ స్థాయి హీరోలు, మీరు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయి సినిమా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్.? మీకు తెలుగు పెద్దగా సక్సెస్ లేదు అని మీరే చెప్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా చేయడం ఎంతవారకు కరెక్ట్.? అని ప్రశ్నించారు. దానికి కిరణ్ సూపర్ గా సమాధానం ఇచ్చారు.

ఇది కూడా చదవండి :Anjala Zaveri: ఓర్నీ..! టాలీవుడ్ విలన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న అంజలా జవేరి.. ఆయన ఎవరంటే

పవన్ కళ్యాణ్ గారు పాన్ ఇండియా సినిమా చేయాలనుకుంటే చేస్తారు సార్.. ఆయన ఇంట్రెస్ట్ లే..కో ఏమో చేయడం లేదు. ఇక ఇక్కడ స్థాయి అనేది నాది కాదు.. కంటెంట్ ది.. కంటెంటే స్థాయి.. కంటెంట్ బాగుంటే సినిమాను తప్పకుండా చూస్తారు. మంజుమెల్ బాయ్స్ అనే సినిమా మలయాళం నుంచి వచ్చింది. మనదగ్గర కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ హీరో పేరు ఎవరికైనా తెలుసా.? అలాగే కాంతార థీమ్ మనకు అంతకు ముందు పెద్దగా తెలియదు.. నా స్థాయి పెద్దదా.. చిన్నదా అన్నది సెకండ్ థింగ్. మనమిచ్చే కంటెంట్ కు ఆ స్థాయి ఉన్నదా అన్నదే మ్యాటర్. కంటెంట్ బాగుంటే మీ అందరూ సినిమాను ఎక్కడికో తీసుకెళ్తారు. ‘క’ అనే సినిమా కంటెంట్ పై నాకు నమ్మకం ఉంది అందుకే వేరే భాషల్లోకి వెళ్దాం అనుకున్నాం అని అన్నారు. దాంతో కిరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. శబాష్ కిరణ్ అబ్బవరం..! అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here