Tollywood: ఈ క్యూట్ చిన్నారి కల్కి సినిమాలో నటించిన హీరోయిన్.. కుర్రాళ్ల లేటేస్ట్ క్రష్.. ఎవరో తెలుసా..?

0
17
ఈ క్యూట్ చిన్నారి కల్కి సినిమాలో నటించిన హీరోయిన్..

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా కల్కి 2898 ఏడి. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్‏గా భారీ వసూళ్లు రాబడుతుంది. జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, దీపికా పదుకొణె, దిశా పటానీ , కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సినిమాలో మలయాళీ స్టార్ హీరోయిన్ కూడా ముఖ్య పాత్రలో మెరిసింది. కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆ అందాల తారకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. తను ఎవరో గుర్తుపట్టారా..? తనే మలయాళీ హీరోయిన్ అన్నా బెన్.

ప్రస్తుతం విజయవంతంగా దూసుకుపోతున్న కల్కి సినిమాలో కైరా పాత్రల నటించింది ఈ బ్యూటీ. ఉంగరాల జుట్టు, అల్లరి చిరునవ్వు, సహజమైన నటనా శైలితో అతి తక్కువ చిత్రాల ద్వారా మలయాళీ హృదయాలను కొల్లగొట్టింది. మలయాళంలో అనేక సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మలయాళంలో స్క్రీన్ రైటర్ బెన్నీ పి నాయరాంబలం కుమార్తె అన్నా బెన్. కుంబలంగి నైట్స్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో ఫహాద్ ఫజిల్ మరదలి పాత్రలో నటించి మెప్పించింది.

ఆ తర్వాత హెలెన్, కప్పేలా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. కప్పేలా సినిమాలోని నటనకు అన్నా బెన్ ఉత్తమ నటిగా రాష్ట్ర అవార్డ్ అందుకుంది. అలాగే మలయాళంలో కసారా, నారదన్, నైట్ డ్రైవ్, కప్ప, త్రిశంకు వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో తెలుగు, తమిళం, కన్నడ ప్రేక్షకులకు చేరువయ్యింది. సోషల్ మీడియాలో అన్నా బెన్ చాలా యాక్టివ్. నిత్యం లేటేస్ట్ క్రేజీ పిక్స్ షేర్ చేస్తూ సందడి చేస్తుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here