Aman Preet Singh: రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‏కు డ్రగ్స్ పాజిటివ్.. పరారీలో మరో ఇద్దరు..

0
18
హైదరాబాద్ డ్రగ్స్ కేసులో అసలు నిజాలివే..

సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ మహా నగరంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్ఓటీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి జరిపిన తనీఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ తోపాటు మరో అయిదుగురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి నుంచి రూ.2 కోట్లకు పైగా విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. అమన్ ప్రీత్ సింగ్ ను వినియోగదారుడిగానే విచారిస్తున్నామన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశామని.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని అన్నారు. పరారీలో ఉన్నవారిలో కీలకసూత్రధారి నైజీరియన్ ఉన్నారని అన్నారు. ఓ నౌహ నైజీరియా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ వస్తుందని.. పట్టుబడిన వారి నుంచి శాంపిల్స్ తీసుకున్నామన్నారు. 2 పాస్ పోర్టులు, 10 సెల్ ఫోన్స్, 2 బైకులు సీజన్ చేశామని తెలిపారు సీఐ శ్రీనివాస్. విఐపీలే టార్గెట్ గా హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నడుస్తున్నట్లుగా పేర్కొన్నారు. హైదర్ షా కోట్ లో రైడ్ చేసి మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశామని.. నిజానికి తమకు అందిన టిప్ మేరకు డ్రగ్స్ అమ్మేవారు కొనుగోలు చేసేవారు మీటింగ్ పెట్టుకున్నప్పుడు అరెస్ట్ చేశామని తెలిపారు.

డ్రగ్స్ ను నైజీరియన్ మహిళ అనోహ బ్లెస్సింగ్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఫేక్ పాస్ట్ పోర్టుతో నైజీరియా నుంచి హైదరాబాద్ వచ్చిందని.. 2019 నుంచి డ్రగ్స్ సరాఫరా చేస్తోందని అన్నారు. ముంబై, గోవా, బెంగుళూరు ద్వారా ఆరు నెలల్లో 2.6 కిలోల కొకైన్ హైదరాబాద్ కు తీసుకొచ్చిందని.. ఈ ఆరు నెలల్లో 30 మంది వీఐపీ కస్టమర్లకు కొకైన్ సరాఫరా చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. అమన్ సింగ్ తోపాటు డ్రగ్స్ తీసుకున్న కిషన్ రాటి, అంకిత్, యశ్వంత్, రోహిత్, శ్రీ చరణ్, ప్రసాద్, హేమంత్, నిఖిల్ దావన్, మధు, రఘు కృష్టంరాజు వెంకట్ మరో ఆరుగురుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అలాకో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ గ్యాంగ్ కు చెందిన కీలక సూత్రదారి ఏబుక సుజి పరారీలో ఉన్నారని.. అతడిపై రూ.2 లక్షల రివార్డ్ ఉందని తెలిపారు. డ్రగ్స్‌ తీసుకుంటున్న అయిదుగురు నుంచి శాంపిల్స్‌ తీసుకోగా.. అయిదుగురికి కూడా కొకైన్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు.

వీడియో చూడండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here