Dil Raju: జస్ట్ మిస్.. దిల్ రాజు పెద్ద నష్టం నుంచి బయటపడ్డాడుగా..

0
29
జస్ట్ మిస్.. దిల్ రాజు పెద్ద నష్టం నుంచి బయటపడ్డాడుగా..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించాడు. నష్టాల బారిన పడకుండా కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు. పెద్ద పెద్ద సినిమాలతో పాటు చిన్న చిన్న సినిమాలకు కూడా నిర్మిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల దిల్ రాజు చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. రీసెంట్ గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు పెద్ద నష్టం నుంచి బయట పడ్డారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే ఎందుకు దిల్ రాజు నష్టం నుంచి బయట పడ్డారు.? అసలు ఏం జరిగింది.?

కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం 58 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. శనివారం కంటే ఆదివారం వసూళ్లు మరింత తగ్గాయి. పాత కథ, కథనం అవ్వడంతో ప్రేక్షకులకు సినిమా అంతగా నచ్చలేదు. ఈ సినిమాని నిర్మించిన కారణంగా లైకా ప్రొడక్షన్ నష్టపోయింది. భారతీయుడు సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా సినిమా విడుదలైన తర్వాత అంతా రివర్స్ అయ్యింది. ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూ రావడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఈ సినిమాని మొదట దిల్ రాజు నిర్మించాలని అనుకున్నారట..

ఇంతకు ముందు దిల్ రాజుకు ‘ఇండియన్ 2’ సినిమా ఆఫర్ వచ్చింది. ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. శంకర్ చూపించిన ఆలస్యానికి అలాగే భారీ బడ్జెట్ కారణంగా దిల్ రాజు సినిమా నుండి తప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు భారతీయుడు 2 నుంచి దిల్ రాజు బయట పడ్డారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ తర్వాత దిల్ రాజుకి మరో సినిమా కథ చెప్పాడట శంకర్. దీనికి దిల్ రాజు ఇష్టపూర్వకంగా అంగీకరించారు. అదే ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమా నిజంగా దిల్ రాజు కెరీర్‌లో గేమ్ ఛేంజర్‌గా అవుతుందని అంతా అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here