Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedSri Satya: 'అందుకే అక్కడ సర్జీరీ చేయించాను, వారితో సంబంధం అంటగట్టేస్తున్నారు': బిగ్ బాస్ ఫేమ్...

Sri Satya: ‘అందుకే అక్కడ సర్జీరీ చేయించాను, వారితో సంబంధం అంటగట్టేస్తున్నారు’: బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

తెలుగమ్మాయి శ్రీ సత్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘నిన్నే పెళ్లాడుతా’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెలు’, ‘త్రినయని’ వంటి సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించిందీ అందాల తార. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించిన శ్రీ సత్య బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది. తన అందం, ఆటతీరుతో సుమారు 103 రోజుల పాటు హౌజ్ లోని గడిపింది. బిగ్ బాస్ షో ద్వారానే తెలుగు వారందరికీ బాగా దగ్గరైందీ శ్రీ సత్య. అయితే హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా ఆమెకు సినిమాల్లో పెద్దగా అవకాశాలేమీ రాలేదు. అందుకే ప్రస్తుతం పలు టీవీ డ్యాన్స్ షోస్ లు చేస్తూ బిజీగా ఉంటోంది. అలాగే బిగ్ బాస్ మరో కంటెస్టెంట్ మొహబూబ్‌తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఇదిలా ఉంటే సిద్ధూ జొన్నల గడ్డ నటించిన లేటెస్ట్ హిట్ సినిమా టిల్లు స్క్వేర్‌ లో ఓ పాత్రలో మెరిసింది. అయితే స్క్రీన్ పై ఆమె కనిపించిదే కొద్ది సేపే. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరైంది శ్రీ సత్య. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కెరీర్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంది.

‘నేను డీజే టిల్లు 2 సినిమాలో షూటింగ్ చేశా. కానీ మూవీ రిలీజయ్యేసరికి కాసేపే కనిపించాను. సినిమా నిడివి ఎక్కువ అవ్వడం వల్ల నేను నటించిన సీన్స్ కట్ చేశారు. గతంలో ఎక్కడ అవకాశాల కోసం పోయినా ముఖం చిన్నదిగా కనిపిస్తోందని అనేవారు. ఈ సమస్యను ఎలా సరిదిద్దాలి అని ఆలోచిస్తుండగా లిప్ ఫిల్లర్స్ చేయిస్తే బాగుంటుందని తెలిసింది. అందుకే టెంపరరీగా మూడు నాలుగు నెలల కోసం ఇలా లిప్ ఫిల్లర్స్ చేయించాను. అయితే ఇప్పుడు చాలామంది అప్పటి లుక్ బాగుందని అంటున్నారు. మరోవైపు సినిమా చేసే వాళ్లు మాత్రం ఇప్పుడే మెచ్యురిటీగా కనిపిస్తున్నావంటున్నారు. డ్యాన్స్ షోస్ సమయంలో నేను ఎవరితో డాన్స్ చేసినా వారితో సంబంధం అంటగడుడుతున్నారు. సోషల్ మీడియాలో నీచమైన కామెంట్లు పెడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రొఫెషనల్ విధానం వేరు, పర్సనల్ వ్యవహారం వేరు’ అని శ్రీ సత్య చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మెహబూబా, శ్రీ సత్యల ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments