రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, వ్యాపారవేత్త కుమార్తె రాధిక మర్చంట్ వివాహం ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లేయర్ జాన్ సెనా, కిమ్ కర్దాషియాన్‌తో పాటు పలువురు ఈ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నారు. ఈ వివాహానికి బాలీవుడ్ మొత్తం హాజరయ్యారు. ఈ వివాహానికి సినీ ప్రముఖులంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, రామ్ చరణ్, వెంకటేష్ ఇలా చాలా మంది హాజరయ్యారు.