టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. కానీ కొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అందులో దేవి పుత్రుడు సినిమాలో నటించిన చిన్నారి వేగా తమోటియా ఒకరు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో సౌందర్య కథానాయికగా కనిపించింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సీనియర్ హీరో సురేష్, హీరోయిన్ అంజలి కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈమూవీలో వెంకీ కూతురిగా కనిపించింది వేగా తమోటియా. ద్వాపర యుగంలోని నీట మునిగిన ద్వారక ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అలాగే ఇందులోని శ్రీకృష్ణుడి పాటలో కనిపించిన ఆ చిన్నారి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. ఇప్పటికీ ఆ చిన్నారికి ప్రత్యేక అభిమానులు ఉన్నారు. దేవిపుత్రుడు సినిమా తర్వాత ఆ అమ్మాయి మరో సినిమాలో కనిపించలేదు.
చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్ అడియన్స్ మనసులలో ఉండిపోయిన వేగా తమోటియా.. ఆ తర్వాత హీరోయిన్ గా, నిర్మాతగా మారింది. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో నటించింది. 1985లో జన్మించిన వేగా తమోటియా.. కథానాయికగా తెలుగులో హౌస్ ఫుల్ సినిమాలో నటించింది. కానీ ఈ బ్యూటీకి అంతంగా గుర్తింపు రాలేదు. అలాగే వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ హ్యాపీగా సినిమాలో నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో వేగా తమోటియాకు తెలుగులో ఆఫర్స్ కూడా రాలేదు.
హ్యాపీ హ్యాపీగా సినిమా తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించింది. కానీ ఈ బ్యూటీకి అందం, టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తుంది. చిన్నప్పుడు బొద్దుగా ఎంతో క్యూట్ గా ఉన్న దేవి పుత్రుడు చైల్డ్ ఆర్టిస్టును ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. వేగా తమోటియా చివరగా మెట్రో పార్క్ చిత్రంలో కనిపించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.