Raj Tarun- Lavanya: ‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను’.. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్యాయత్నం.. చివరకు..

0
17
Raj Tarun- Lavanya: 'రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను'.. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్యాయత్నం.. చివరకు..

ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్ చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ హీరోపై కేసు పెట్టిన లావణ్య శుక్రవారం (జులై 12) అర్ధరాత్రి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ‘రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేను.. ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను’ అంటూ తన అడ్వొకేట్ కు సందేశం పంపించింది. దీంతో స్పందించిన సదరు అడ్వొకేట్ వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లారు. ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక తన సూసైడ్ నోట్ లో పలు సంచలన విషయాలను పేర్కొంది లావణ్య ‘రాజ్ లేని లైఫ్‌లో నేను ఉండలేను.. బతకలేను. అన్నీ కోల్పోయాను. ఈ లోకంలో నా పయనం పూర్తి చేసాను. అందుకే ఈ లోకం నుండి వెళ్లిపొతున్నాను. నేను ఏంటో బాగా తెలిసిన మనుషులే నన్ను తప్పు పడుతున్నారు. అదే సమయంలో నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు. రాజ్‌తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు.’

‘మైండ్‌ గేమ్‌, గాసిప్స్‌తో నేను బాగా విసిగిపోయాను. మస్తాన్‌ కేసులో నేను కీలు బోమ్మను అయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరగుతోంది. నా భర్త నాకు కావాలని మాల్విని బతిమలాడాను. కానీ మాల్వి నా మాటలు వినిపించుకోవడం లేదు. నా చావుకు కారణం రాజ్‌తరుణ్‌, అతని తల్లిదండ్రులే. ఇక నా చావుకు ప్రధాన కారకురాలు మాత్రం మాల్వీ మల్హోత్రానే. ఆమె రాజ్ తరుణ్ తో జీవించాలనుకుంటోంది. రాజ్ కూడా మాల్వీ మోజులో పడి బాగా మారిపోయాడు. ఇప్పుడు అతను నా చావుని కోరుకుంటున్నాడు’ అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. చివరగా తన కుటుంబ సభ్యులు, ప్రముఖ న్యాయవాది దిలీప్ సుంకర, మీడియాకు క్షమాపణలు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here