Deeksha Seth: వేదం సినిమాలో అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా..? సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..

0
20
Deeksha Seth: వేదం సినిమాలో అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా..? సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..

Deeksha Seth: వేదం సినిమాలో అల్లు అర్జున్ గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా..? సినిమాలు ఎందుకు చేయట్లేదంటే..

సినీరంగుల ప్రపంచంలోకి చాలామంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరికి పది సినిమాలు చేసినా రానీ క్రేజ్.. మరికొందరికి మాత్రం కేవలం ఒక్క సినిమాతోనే వచ్చేస్తుంది. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ పోషించిన తారలు.. ఒక్కసినిమాతోనే స్టార్ డమ్ అందుకుంటారు. కానీ అదే గుర్తింపును ఎప్పటికీ మెయింటైన్ చేయలేరు. ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. స్టార్ హీరోస్ సినిమాల్లో నటించినా.. ఆ తర్వాత ఆఫర్స్ రాక సైలెంట్ అయిపోతారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే కుర్రాళ్ల క్రష్ గా మారి… ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లలో దీక్షా సేత్ ఒకరు. ఈ పేరు చెబితే ఇప్పుడు అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ రెబల్ సినిమాలో ప్రభాస్ గర్ల్ ఫ్రెండ్.. లేదా వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. హా.. ఆ అమ్మాయే దీక్షా సేత్.

వేదం సినిమాలో అల్లు అర్జున్ రిచ్ గర్ల్ ఫ్రెండ్‏గా కనిపించింది. ఈ మూవీ తర్వాత తెలుగులో దీక్షాకు మంచి ఆఫర్స్ వచ్చాయి. టాలెంటెడ్ హీరో గోపిచంద్ సరసన వాంటెడ్ మూవీలో మెరిసింది. అలాగే మాస్ మాహారాజా రవితేజ నటించిన నిప్పు, మిరపకాయ చిత్రాల్లో కనిపించింది. ఇవే కాకుండా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రెబల్ సినిమాలో నటించింది. ఈ చిత్రాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో దీక్షా నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఊహించినంతగా ఆఫర్స్ మాత్రం రాలేదు. చివరగా తెలుగులో 2012లో వచ్చిన ఊ కొడతార.. ఉలిక్కిపడతారా సినిమాలో కనిపించింది.

ఇక ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో లేకర్ హమ్ దివానా దిల్, ది హౌస్ ఆఫ్ ది డెడ్ 2 వంటి చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ కూడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. తెలుగు, హిందీలోనే కాకుండా.. ప్రస్తుతం జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్ జోడిగా జగ్గూబాయ్ సినిమాలో నటించింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడంతో లండన్ వెళ్లిపోయింది దీక్షా. ప్రస్తుతం అక్కడే ఐటీ జాబ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ దీక్షా సేత్ చాలా సైలెంట్. కానీ ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Deeksha Seth (@deeksha721)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here