Manchu Vishnu: ఇకపై అలా చేస్తే ఊరుకోను.. 48 గంటలు టైమ్ ఇస్తున్నా.. తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు మంచు విష్ణు వార్నింగ్..

0
21
తెలుగు యూట్యూబ‌ర్‌ల‌కు మంచు విష్ణు వార్నింగ్.. 48 గంటలు డెడ్ లైన్

నటీనటులపై ట్రోలింగ్‌ వీడియోలు చేస్తున్న యూట్యూబర్లు, ట్రోలర్లకి విష్ణు వార్నింగ్ ఇచ్చారు. మహిళలను అత్యంత జుగుప్సాకరంగా వర్ణించడం ఏ మాత్రం సమర్థనీయం కాదని మంచు విష్ణు తేల్చి చెప్పారు. మీ ఇంట్లో తల్లి, చెల్లి, భార్య, కూతుళ్లు లేరా.. అంటూ ప్రశ్నించారు. నటీనటులపై చెత్త వీడియోలు, మీమ్స్‌ 48 గంటల్లో డిలీట్ చేయాలి.. లేకపోతే యూట్యూబ్‌ అకౌంట్లు బ్లాక్ చేయిస్తామన్నారు. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విష్ణు వార్నింగ్ ఇచ్చారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వివాదంపై మంచు విష్ణు ఈ విధంగా స్పందించారు. ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్లు యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా వంటి సోషల్ మీడియా వేదికల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని.. దీంతో తెలుగు వాళ్లకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. ఇప్పటివరకు సినీ నటీనటుల గురించి చేసిన ట్రోలింగ్ వీడియోలను 48 గంటల్లో డిలీట్ చేయాలని లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటికే ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here