Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedTollywood: ఈ చిన్నారి ఒక్క వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయింది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

Tollywood: ఈ చిన్నారి ఒక్క వాసెలిన్ యాడ్‌తో హీరోయిన్ అయింది.. ఎవరో గుర్తుపట్టగలరా ?

సాధారణంగా సినీ పరిశ్రమలో చాలా మంది తారలు గమ్యం వేరుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి తాము నిర్ణయించుకున్న లక్ష్యాలను కాకుండా మరోదారిని ఎంచుకున్నట్లు చెబుతారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్స్ తాము ఎప్పుడూ నటిగా మారాలని అనుకోలేదని.. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని అంటారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి 12వ తరగతిలో టాపర్. అంతేకాదు.. IAS ఆఫీసర్ కావాలనుకుంది. కట్ చేస్తే ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? కెరీర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. అలాగే వాణిజ్య ప్రకటనలలోనూ మెరిసింది. ఈ అమ్మాయి చేసిన వాసెలిన్ యాడ్ లో నటించింది. ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తుంది. తనే హీరోయిన్ రాశీ ఖన్నా.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలు దోచేసింది. అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సరసన అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి స్టార్ హీరోల మూవీలో అవకాశాలు మాత్రం రాలేదు. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది. ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన యోధ సినిమాలో కనిపించింది.

నిజానికి రాశీ ఖన్నా తన సినీ ప్రయాణాన్ని హిందీ సినిమాతోనే ప్రారంభించింది. జాన్ అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతోనే నటిగా పరిచయమైంది. ఈ మూవీలో రాశీ ఖన్నా పోషించిన పాత్ర చాలా చిన్నది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగు, తమిళంలో భాషలలో వరుస ఆఫర్స్ వచ్చాయి. ఇక ఇటీవలే అరణ్మనై 4 చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో ది సబర్మతి రిపోర్ట్ మూవీతోపాటు.. తలాఖోన్ మే ఏక్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. ఇక తెలుగులో తెలుసు కదా మూవీలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments