Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedDirector Maruthi: ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా దర్శకుడి మారుతి కూతురు.. ఎంత క్యూట్‏గా ఉందో...

Director Maruthi: ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా దర్శకుడి మారుతి కూతురు.. ఎంత క్యూట్‏గా ఉందో చూశారా..?

Director Maruthi: ప్రభాస్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా దర్శకుడి మారుతి కూతురు.. ఎంత క్యూట్‏గా ఉందో చూశారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‏లో మారుతి ఒకరు. యూత్‏ను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈరోజుల్లో సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఇండస్ట్రీలో మారుతి పేరు మారుమోగింది. ఆ తర్వాత బస్ స్టాప్, ప్రేమకథ వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న మారుతి.. అత తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా మారిపోయాడు. చిన్న సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించడం.. వసూళ్లు రాబట్టడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. న్యాచురల్ స్టార్ నాని నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు. చాలాకాలం పాటు బ్రేక్ తీసుకున్న మారుతి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమాతో మరోసారి ఒకప్పటి డార్లింగ్ ను అడియన్స్ ముందుకు తీసుకువచ్చేలా కనిపిస్తున్నాడు మారుతి. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. తాజాగా మారుతి ఫ్యామిలీ గురించి.. ఆయన కూతురి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. మారుతి ఇటీవల జామ్ జంక్షన్ అనే మ్యూజిక్ బ్యాండ్స్ కు సంబంధించిన కాంపిటేషన్ ప్రోగ్రాం చేయబోతున్నారు. ఆరు మ్యూజిక్ బ్యాండ్స్ తో సెప్టెంబర్ 6న ఈ కాంపిటేషన్ ప్రోగ్రాం చేయనున్నారు. అయితే ఈ ప్రోగ్రాంకు సంబంధించిన పనులను మారుతి కూతురు హియా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈప్రోగ్రాంకు సంబంధించిన ఓ ఈవెంట్ లో తన తండ్రితో కలిసి హజరయ్యింది. ఈ క్రమంలోనే హియ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Hiya

Hiya

“చిన్నప్పటి నుంచి క్రియేటివ్ సైడ్ ఎక్కువగా ఆలోచించేదాన్ని. నాన్నకు పనిలో కూడా హెల్ప్ చేశాను. ప్రస్తుతం ఇంటర్ కంప్లీట్ చేశాను.. త్వరలోనే అబ్రాడ్ వెళ్లి చదువుకుంటాను. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాను. నాకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వర్క్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను. ఇక మా తమ్ముడి మ్యూజిక్ సైడ్ వెళ్తున్నాడు. ప్రస్తుతం డ్రమ్మర్స్, పియానో ప్లే చేస్తున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న మారుతి కూతురు ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తుందా ? అని ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Director Maruthi (@maruthi_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments