Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTiger Shroff: బాబోయ్.. ఈ స్టార్ హీరో చెల్లెలు చాలా డిఫరెంట్.. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న...

Tiger Shroff: బాబోయ్.. ఈ స్టార్ హీరో చెల్లెలు చాలా డిఫరెంట్.. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అక్కడ ఫేమస్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్‏గా పేరు సంపాదించుకున్నాడు జాకీ ష్రాఫ్. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించారు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో.. అలాగే ఎన్టీఆర్ శక్తి సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు జాకీ ష్రాఫ్. ఇక ఇప్పుడిప్పుడే బీటౌన్ ఇండస్ట్రీలో స్టార్స్ వారసులు, వారసురాళ్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోహీరోయిన్స్ కొడుకులు, కూతుళ్లు సినీరంగంలోకి అడుగుపెట్టి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఒకప్పటి విలన్ జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా సక్సె్స్ అయ్యాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. టైగర్ ష్రాఫ్ ప్రేమకథా చిత్రాలు కాకుండా ఎక్కువగా యాక్షన్ తరహా మూవీస్ పై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు జాకీ ష్రాఫ్ కూతురి గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. జాకీ ష్రాఫ్ కూతురు.. టైగర్ ష్రాఫ్ చెల్లెలు పేరు కృష్ణ ష్రాఫ్. ఇప్పటివరకు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న కృష్ణ ష్రాఫ్ నెట్టింట మాత్రం చాలా ఫేమస్. ఇప్పటికే బిజినెస్ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసింది. అలాగే కొన్ని టీవీ షోలలో పాల్గొంది. నెట్టింట హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఇప్పటికే చాలా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కృష్ణ ష్రాఫ్ బాస్కెట్ బాల్ ప్లేయర్. అలాగే ఫిట్నెస్, జిమ్ కు సంబంధించిన బిజినెస్ చేస్తుంది.

ఇప్పటికే పలు బిజినెస్ అవార్డులు కూడా అందుకుంది. అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ రెజ్లర్ రంగంలోనూ భాగస్వామం పంచుకుంది. ఇక సోషల్ మీడియాలో కృష్ణ ష్రాఫ్ చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ గ్లామర్ మోడ్రన్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. ఇక ఈ అమ్మడు ఫోటోస్ చూసి తండ్రి, అన్నలాగే ఈ బ్యూటీ కూడా సినిమాల్లో హీరోయిన్ అవుతుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments