Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedKalki 2898 AD: 'కల్కి' టీమ్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు జారీ.. ప్రభాస్‌కి కూడా.....

Kalki 2898 AD: ‘కల్కి’ టీమ్‌కు బిగ్ షాక్.. లీగల్ నోటీసులు జారీ.. ప్రభాస్‌కి కూడా.. కారణమిదే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ ఫిక్షనల్ స్టోరీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, శోభన వంటి స్టార్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సంస్థ సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన్ కల్కి బాక్సాఫీస్ రికార్డులు దులిపేస్తోంది. సినిమా రిలీజై సుమారు నెల రోజులు కావొస్తున్నా కలెక్షన్ల ప్రభంజనం ఆగడం లేదు. బరిలో పెద్ద సినిమాలేవీ కూడా లేకపోవడంతో ‘కల్కి 2898 AD’ సినిమా చూడ్డానికి జనాలు ఎగబడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. కాగా ఈ సినిమాకు ప్రధానం కారణం మహా భారతం సీన్స్. చాలా మంది జనాలు ఈ సీన్ల కోసమే కల్కి సినిమాకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే సన్నివేశాల విషయమై కల్కి చిత్ర బృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్ర బృందంతో పాటు సినిమా ప్రధాన పాత్ర ధారులైన హీరో ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఇవి కూడా చదవండి

‘మన పురాణాల్లో ఉన్న వాటికి కల్కి సినిమా విరుద్ధంగా ఉంది. ఈ సినిమా మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. చిత్ర బృందం స్పందన కోసం మేం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్‌నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలు, ఇతిహాసాలపై జనాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది’ అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

కాగా కల్కి సినిమా కలెక్షన్లపై దుష్ర్పచారం చేసిన కోల్‌కతాకు చెందిన సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ లకు చిత్ర బృందం నోటీసులు పంపింది. వీరిద్దరిపై రూ. 25 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇప్పటికే సుమిత్, రోహిత్‌లకు లీగల్ నోటీసులు పంపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments