Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedBigg Boss Telugu 8: బిగ్‏బాస్ 8 ప్రోమో వచ్చేసింది.. అసలు విషయం చెప్పేసిన హోస్ట్...

Bigg Boss Telugu 8: బిగ్‏బాస్ 8 ప్రోమో వచ్చేసింది.. అసలు విషయం చెప్పేసిన హోస్ట్ నాగార్జున..

బుల్లితెరపై బిగ్‏బాస్ షోకు ఉన్న పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు. ఓవైపు ఈ షోపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ.. చూసే అడియన్స్ మాత్రం తగ్గడంలేదు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈషోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే తెలుగులో మాత్రం మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా.. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని హోస్టింగ్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి బిగ్‏బాస్ షోకు అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇన్నాళ్లు ఉన్న బిగ్‏బాస్ షో రూల్స్, హోస్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని సీజన్ 7 నుంచి మార్చేశాడు నాగార్జున. ముఖ్యంగా సీజన్ 7లో హోస్టింగ్ అదరగొట్టేశాడంటూ అడియన్స్ పొగడ్తలు కురిపించారు. సీజన్ 7 సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీజన్ 8 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కొన్నాళ్లుగా సీజన్ 8 ప్రారంభం, కంటెస్టెంట్ లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8 గురించి అప్డేట్ ఇచ్చాడు నాగార్జున. ఈ షో ముందు నుంచే వెరైటీ ప్రమోషన్లతో హడావుడి స్టార్ట్ చేశాడు.

తాజాగా బిగ్‏బాస్ సీజన్ 8 కొత్త లోగో రివీల్ చేస్తూ అసలు ప్రోమో రిలీజ్ చేశాడు నాగార్జున. అయితే ఈ షో ఎప్పటి నుంచి ప్రారంభమనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ కొత్త లోగోను షేర్ చేశాడు నాగార్జున. తాజాగా విడుదలైన కొత్త లోగో కలర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే.. కొద్దిరోజులుగా కంటెస్టెంట్ లిస్ట్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసారి కూడా ఎక్కువ మంది బుల్లితెర సీరియల్స్, యాంకర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో ఫేమస్ అయినవారిని, యూట్యూబర్స్ ను కూడా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయితే ఈ సీజన్ ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్‏బాస్ షో స్టార్ట్ చేయనున్నారు. తాజాగా నాగార్జున షేర్ చేసిన బిగ్‏బాస్ సీజన్ 8 ప్రోమో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments