Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedKalki 2898 AD: చిన్నారులకు 'కల్కి' సినిమా మేకర్స్ గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు.....

Kalki 2898 AD: చిన్నారులకు ‘కల్కి’ సినిమా మేకర్స్ గోల్డెన్ ఛాన్స్.. ఇలా చేస్తే చాలు.. అసలు మిస్ అవ్వొద్దు

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలై నెల రోజులు కావస్తోంది. అయినా ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం ఆగడం లేదు. బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లు రాబడుతోంది. బరిలో పెద్ద సినిమాలేవీ కూడా లేకపోవడంతో ‘కల్కి 2898 AD’ సినిమా చూడ్డానికి జనాలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అభిమానులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. దీంతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా కల్కి మేకర్స్ చిన్న పిల్లలకు ఒక గోల్డెన్ చాన్స్ ఇచ్చారు. అదేంటంటే.. కల్కి మూవీ కోసం వేసిన సెట్‌ను చూసే గోల్డెన్ చాన్స్ చిన్నపిల్లలకు ఇస్తున్నట్లు కల్కి నిర్మాతలు ప్రకటించారు. ఇందుకోసం మీ చిన్నారితో కల్కి సినిమాకు సంబంధించి మాట్లాడించి ఆ వీడియో వారికి పంపాలి. అలా పంపిన వారిలో కొందరి ఎంపిక చేసి కల్కి సెట్ చూసే అవకాశం ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను వైజయంతీ నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.

‘మీ చిన్నారులకు కల్కి సెట్స్‌ను చూపించాలనుకుంటున్నారా? మీ చిన్నారి కల్కి గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి మాకు పంపండి. కల్కి సెట్స్‌ను చూసే అద్భుత అవకాశాన్ని పొందండి! మీ వీడియోలకు #ILoveKalki అనే హ్యాష్‌ట్యాగ్‌ని జత చేయండి’ అని సూచించింది. మరి, మీ చిన్నారులు ప్రభాస్ నటంచిన సినిమ కల్కి సెట్స్‌ను చూపించాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం. మీ పిల్లాడితో మాట్లాడించి ఒక వీడియోను కల్కి టీమ్ కు పంపండి.

ఇవి కూడా చదవండి

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటించింది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని, శోభన వంటి స్టార్ నటీనటులు వివిధ పాత్రల్లో మెరిశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments