Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedKanguva: కంగువ నుంచి క్రేజీ న్యూస్.. సినిమాలో సూర్య అన్ని గెటప్స్‌లో కనిపిస్తారట..

Kanguva: కంగువ నుంచి క్రేజీ న్యూస్.. సినిమాలో సూర్య అన్ని గెటప్స్‌లో కనిపిస్తారట..

తమిళ్ స్టార్ హీరో సూర్య సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. తెలుగులోనూ ఈ హీరోకు మంచి డిమాండ్ ఉంది. సూర్య సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అవుతాయి. టాలీవుడ్ లో సూర్యకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు అదిరిపోయే మార్కెట్ కూడా ఉంది. ఇక ఇప్పుడు కంగువ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సూర్య.  సూర్య ‘కంగువ’ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. కంగువ కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సూర్య మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో మూడు పాత్రల కోసం సూర్య తనని తాను మార్చుకున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయన నటించిన మూడు పాత్రలు ‘కంగువ’ కథకు అదిరిపోయే ట్విస్ట్‌ని తీసుకువస్తుందని తెలుస్తోంది. ‘కంగువ’ నుండి సూర్య  రెండు లుక్‌లు ఇప్పటికే రివీల్ అయ్యాయి.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా కనిపించబోతున్నాడు. తమిళంలో బాబీకి ఇదే మొదటి సినిమా. ఈ చిత్రంలో బాబీతో పాటు దిశా పటానీ కూడా కనిపించనుంది. ఈ చిత్రంలో నటరాజన్ సుబ్రమణ్యం, జగపతి బాబు, యోగి బాబు, రాడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనందరాజ్, రవి రాఘవేంద్ర వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాలో ఓ అద్భుతమైన వార్ సీక్వెన్స్ ఉండనుంది. ఈ వార్ సీక్వెన్స్‌లో దాదాపు 10 వేల మంది వరకు ఉండబోతున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కూడా 3డి ఫార్మాట్‌లో విడుదల కానుంది. సూర్య చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన ‘సర్ఫిరా’ చిత్రంలో అతిధి పాత్రలో నటించాడు. దీంతో పాటు ఆయన ఖాతాలో ‘సూర్య 44’ అనే సినిమా కూడా ఉంది. ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్యతో  పూజా హెగ్డే జతకట్టనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments