Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedKalki 2898 AD: కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. ఇద్దరిపైకోట్లు పరువునష్టం...

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ కలెక్షన్స్ పై నెగిటివ్ కామెంట్స్.. ఇద్దరిపైకోట్లు పరువునష్టం దావా వేసిన టీమ్

‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలై నెల రోజులు అవుతుంది. ఇప్పటికి కూడా కల్కి కలెక్షన్స్  ప్రభంజనం ఆగలేదు. ఇప్పటికూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు. ‘కల్కి 2898 AD’ సినిమా చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన కల్కి సినిమాలో చాలా మంది స్టార్ నటీనటులు నటించారు. అయితే కల్కి సినిమా పై కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే కల్కి కలెక్షన్ పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి : నన్ను చూసి తట్టుకోలేవు.. నువ్వు రావొద్దు అన్నాడు.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం

కల్కి సినిమా పై కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ‘కల్కి 2898 AD’ బృందం వారిపై రూ.25 కోట్ల పరువు నష్టం దావా వేసింది. పాన్ ఇండియా సినిమాలకు మంచి రివ్యూలు వస్తే 500-1000 కోట్ల రూపాయలను సులువుగా సంపాదిస్తాయి. గత రెండేళ్లలో ‘కేజీఎఫ్ 2’, ‘జవాన్’, ‘పఠాన్’, ‘జైలర్’, ‘లియో’, ‘యానిమల్’ వంటి ఎన్నో సినిమాలు రూ.500-1000 కోట్ల బిజినెస్ చేశాయి. అలాగే ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కూడా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే, కోల్‌కతాకు చెందిన కొందరు విమర్శకులు సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ కల్కి పై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాంతో ‘కల్కి 2898 ఏడీ’ బృందం కోర్టుకు వెళ్లింది. వీరిద్దరిపై రూ.25 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇప్పటికే సుమిత్, రోహిత్‌లకు లీగల్ నోటీసులు పంపారు.

ఇదికూడా చదవండి : Rashmika Mandanna: నువ్వు లేవంటే నమ్మలేకపోతున్నా.. నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

సుమిత్‌, రోహిత్‌లు ‘సమోసా క్రిటిక్స్‌’గా పేరు తెచ్చుకున్నారు. వారిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ‘కల్కి 2898 AD’ సినిమా కలెక్షన్ గురించి ట్వీట్ చేస్తూనే ఉన్నారు. ‘కల్కి 2898 AD’ కలెక్షన్స్ నకిలీవని చెప్పడానికి ఇద్దరూ సాక్షాలు సమర్పించాలి. అలాగే సినిమా ఎంత వసూళ్లు చేసిందనేది కూడా చూపించాలి. దీంతో పాటు పరువు నష్టం కోసం 25 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్,  దీపికా పదుకొణె, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. ‘కల్కి 2898 AD’  చిత్రాన్ని అశ్విని దత్ నిర్మించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments