Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedDiljit Dosanjh: డ్యాన్సర్లను మోసం చేసిన సింగర్.. కష్టపడి డాన్స్ చేసినా డబ్బులు ఇవ్వలేదంటూ ఆరోపణలు..

Diljit Dosanjh: డ్యాన్సర్లను మోసం చేసిన సింగర్.. కష్టపడి డాన్స్ చేసినా డబ్బులు ఇవ్వలేదంటూ ఆరోపణలు..

పంజాబీ గాయకుడు దిల్జిత్ దుస్సాంజ్ ఇప్పుడిప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇన్నాళ్లు సింగర్‏గా, నటుడిగా ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ చేసిన దిల్జిత్.. ఇప్పుడు నేరుగా హిందీ సినిమాల్లో మెయిన్ లీడ్ రోల్స్ పోషిస్తున్నాడు. అంతేకాకుండా దిల్జీత్.. విదేశాల్లోని ప్రతిష్టాత్మక ఆడిటోరియంలో లైవ్ మ్యూజిక్ సెన్సెషన్స్ ఇచ్చాడు. దిల్జిత్ దోసంజ్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పంజాబీ గాయకుడు. కొద్ది రోజుల క్రితం చమ్మీలా సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దివంగత పంజాబీ సింగర్ అమర్ సింగ్ చమ్కీల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అమర్ సింగ్ పాత్రలో కనిపించాడు. ఇందులో దిల్జిత్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఇటీవలే విదేశాల్లో షో ముగించుకుని తిరిగి వచ్చిన దిల్జిత్ పై అతడితోపాటు వెళ్లిన డ్యానర్స్ తీవ్ర ఆరోపణలు చేశారు. కష్టపడినా పనిచేసిన తమకు జీతాలు ఇవ్వడంలేదని వాపోయారు.

‘దిల్లుమినాటి’ పేరుతో ఈ పర్యటనను దిల్జీత్ దోసాంజ్ నిర్వహించారు. దిల్జీత్ బృందంతో కలిసి అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చాడు. దిల్జీత్ కచేరీలకు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. చాలా ప్రతిష్టాత్మకమైన ఆడిటోరియంలలో దిల్జీత్ అనేక పాటలు పాడరు.. ఈ పర్యటన కోసం సంబంధిత దేశానికి చెందిన భారతీయ సంతతికి చెందిన నృత్యకారులను తీసుకెళ్లారు. అయితే అక్కడ పర్ఫార్మెన్స్ చేసినా తమకు దిల్జిత్ డబ్బులు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు.

లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన రజత్ రాఖీ భట్టా దిల్జీత్ దోసాంజ్‌పై ఆరోపణలు చేశారు. “భారత కళాకారుడు దిల్జీత్ ప్రపంచ హృదయాలను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది, కానీ దేశీయ ప్రతిభకు తగిన విలువ ఇవ్వకపోవడం బాధాకరం. దిల్జిత్ దోసాంజ్ కచేరీలో డ్యాన్స్ చేసిన ఇండియన్ డ్యాన్సర్స్ ఎవరూ పారితోషికం తీసుకోలేదు. వీరంతా ఉచితంగా డాన్స్ చేయాలని దిల్జిత్ చెప్పారు. దేశీయ నృత్యం ఒక పరిశ్రమగా కళాకారుల కడుపు నింపుతుంది. కానీ వినోద పరిశ్రమలో కొరియోగ్రఫీ, స్టేజ్ షోలు, మ్యూజిక్ వీడియోలు, రీల్స్, పాటల విడుదలలు, ప్రమోషన్లలో దేశీ డ్యాన్సర్లను ఉపయోగిస్తున్నారు.. కానీ దేశీయ డ్యాన్సర్లను పట్టించుకోవడం లేదు. దిల్జిత్ మీరు గొప్ప కళాకారుడిగా ఎదుగుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము. దేశీయా ఆర్టిస్టులను గుర్తించి వారికి తగిన గుర్తింపు ఇస్తే మరింత ఆనందంగా ఉంటుంది” అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments