Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedRaj Tarun - Lavanya: న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. సెటిల్‌మెంట్‌ కోసం ఫోన్లు...

Raj Tarun – Lavanya: న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. సెటిల్‌మెంట్‌ కోసం ఫోన్లు చేస్తున్నారంటూ.. లావణ్య కామెంట్స్..

రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసులో మరో అప్‌డేట్‌ వచ్చింది. నార్సింగి పోలీసులు రాజ్‌తరుణ్‌కు నోటీసులిచ్చి… విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది లావణ్య. రాజ్‌తరుణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను వదులుకునే ప్రసక్తే లేదంటోంది. రాజ్ తరుణ్ కోసమే న్యాయ పోరాటం చేస్తున్నానంటోంది. అవసరమైతే నిరహార దీక్షకైనా సిద్ధమంటోంది. మరోవైపు లావణ్య స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. తన దగ్గరున్న ఆధారాలను లావణ్య పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్‌తరుణ్‌కు నోటీసులిచ్చి పోలీసులు విచారణకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో A1గా రాజ్‌తరుణ్‌, A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు. ముగ్గురిపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక.. ఫిర్యాదులో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్‌తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అయ్యాడనే విషయం నుంచి.. తాజా పరిస్థితుల వరకూ ఏం జరిగిందో వివరించింది. 2008 నుంచి రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం అయిందని తెలిపింది. 2010లో రాజ్‌తరుణ్‌ లవ్ ప్రపోజ్‌ చేసి.. 2014లో పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. 2016లో తాను గర్భం దాల్చానని.. కానీ.. రెండో నెలలకే.. అబార్షన్‌ చేయించాడని.. అప్పుడు హాస్పిటల్ బిల్లులన్నీ అతనే చెల్లించాడని వెల్లడించింది లావణ్య.

అంతేకాదు.. రాజ్‌తరుణ్‌ను తన కుటుంబం ఆదుకుందన్న లావణ్య.. 70 లక్షలు అతనికి ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు.. నటి మాల్వీ మల్హోత్రా పరిచయం అయ్యాకే రాజ్‌తరుణ్‌ తన నుంచి దూరమయ్యాడని, ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే.. మాల్వీతో పాటు ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించారని తెలిపింది. ఇదిలావుంటే.. గతంలో తనపై ఉన్న డ్రగ్స్‌ కేసును కూడా ప్రస్తావించింది లావణ్య. ఆ కేసులో రాజ్‌తరుణ్, మాల్వీ తనను ఇరికించారని ఆరోపించింది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానంటున్న లావణ్య.. మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని స్పష్టం చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదనే కారణంతో.. లావణ్య మరోసారి నార్సింగ్‌ పోలీసులను ఆశ్రయించి.. మరికొన్ని ఆధారాలను సమర్పించింది. దాంతో.. రాజ్‌ తరుణ్‌తో పాటు మాల్వీ, మయాంక్‌పై నార్సింగి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ఆసక్తిగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments