Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedAmbani Wedding: అమితాబ్‏ను చూడగానే ఊహించని పని చేసిన రజినీ.. షాకవుతున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

Ambani Wedding: అమితాబ్‏ను చూడగానే ఊహించని పని చేసిన రజినీ.. షాకవుతున్న నెటిజన్స్.. వీడియో వైరల్..

గత వారం పదిరోజులుగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వివానికి ముందు జరిగే మమేరు వేడుక నుంచి సంగీత్, హల్దీ, మెహందీ వేడుకలలో బాలీవుడ్ తారలు మొత్తం సందడి చేశారు. ఇక జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు ప్రపంచ సెలబ్రెటీస్, రాజకీయ, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. అలాగే సౌత్, నార్త్ సినీ స్టార్స్ కూడా అంబానీ పెళ్లి వేడుకలలో సందడి చేశారు. పలువురు సినీ ప్రముఖులు హాజరైన ఈ వివాహ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య, కుమార్తెతో కలిసి హాజరయ్యారు. అనంత్ పెళ్లి వేడుకకు ముందు జరిగిన బరాత్ కార్యక్రమంలో తలైవా డాన్స్ అదరగొట్టేశారు. 73 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో చిన్న చిన్న స్టెప్పులతోనే అదరగొట్టేశారు. రజినీ డాన్స్ చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.

ఇదంతా పక్కన పెడితే నిన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ శుభ్ ఆశీర్వాద్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియో వైరలవుతుంది. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో రజినీ, అమితాబ్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. అమితాబ్ ను చూడగానే నమస్కరిస్తూ వెళ్లిన రజినీ బిగ్ బీ పాదాలను తాకే ప్రయత్నం చేయగా.. అమితాబ్ అప్యాయంగా వారించారు. ఆ తర్వాత ఇద్దరూ కరచాలనం చేసి అప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఆ వీడియోలో అమితాబ్ బచ్చన్ నేనీ బ్లూ కుర్తాలో కనిపించగా.. రజినీ కోలీవుడ్ స్టైల్ కుర్తా, ధోతిలో సంప్రదాయకంగా కనిపించారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి కనిపించారు. గతంలో ఇద్దరు కలిసి హమ్ సినిమాలో నటించారు. ప్రస్తుతం తలైవా నటిస్తున్న వెట్టయన్ సినిమాలో బిగ్ బీ కీలకపాత్ర పోషించనున్నాడు. వీరిద్దరిని కలిసి స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments