Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedTollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? చాలా మంది స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన హీరో.....

Tollywood: ఈ పిల్లాడిని గుర్తు పట్టారా? చాలా మంది స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేసిన హీరో.. సింగర్‌ గానూ ఫేమస్‌

ఈ ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు దక్షిణాది స్టార్ హీరో. లవ్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా ఏ జానర్ సినిమాలకైనా ఇట్టే సరిపోతాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించిన అతను ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలే చేశాడు. ఆతర్వాత యాక్షన్‌ హీరోగా మారిపోయాడు. ఇతను కేవలం హీరోనే కాదు మంచి సింగర్ కూడా. పలువురి స్టార్‌ హీరోల సినిమాల్లో పాటలు పాడి అలరించాడు. సాధారణంగా చాలా మంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఈ హీరోకు మాత్రం స్టార్ హీరోయిన్లు పడిపోతారు. ఇతనితో కలిసి సినిమా చేస్తే చాలు.. ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నడన్న రూమర్లు వెంటనే పుట్టుకొస్తాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై లవర్‌బాయ్‌గా కనిపించే అతనికి నిజ జీవితంలోనూ బోలెడు లవ్ స్టోరీలున్నాయి. పలువురి స్టార్‌ హీరోయిన్లతో అఫైర్లు నడిపి రియల్ ‘వల్లభు’ డిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు. కోలీవుడ్ స్టార్‌ హీరో శింబు. ఇది అతని చిన్ననాటి ఫొటో.

ఇవి కూడా చదవండి

ప్రముఖ డైరెక్టర్ రాజేందర్‌ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు శింబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చి బోలెడు అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక. ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమాలతో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైపోయాడీ హ్యాండ్సమ్ హీరో. ఆ మధ్యన వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నా ‘మానాడు’, ‘పాతు తలా’ చిత్రాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే కెరీర్ ప్రారంభంలోనే నయన తార తో ప్రేమ వ్యవహారం నడిపాడు శింబు. ఆ తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్.. ఇలా శింబు డేటింగ్ చేసిన హీరోయిన్ల లిస్టు పెద్దదిగానే ఉంది. ఒకనొక దశలో హన్సిక, నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి చేసుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి. కానీ అవి రూమర్లు గానే మిగిలిపోయాయి.

థగ్ లైఫ్ సినిమాలో శింబు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments