Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedTollywood: పెళ్లైన ఏడాదికే విడాకులు.. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారిన హీరోయిన్..

Tollywood: పెళ్లైన ఏడాదికే విడాకులు.. గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారిన హీరోయిన్..

గ్లామర్ ప్రపంచంలో క్రేజ్ సొంతం చేసుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి ఎంటర్ అవుతుంటారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన నటీమణులు.. ఒక్క సినిమాతోనే భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంటారు. ఇక సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసే హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. కానీ ఒకటి రెండు చిత్రాల్లో మెరిసిన ముద్దుగుమ్మలు ఉన్నట్లుండి సినిమా ప్రపంచం నుంచి కనుమరుగైపోతుంటారు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారు. మరికొందరు ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకున్న ఆ బ్యూటీ గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారింది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుపట్టారా..? తనే బాలీవుడ్ బ్యూటీ సోఫియా హయాత్.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఓ రేంజ్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది సోఫియా హయాత్. బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా చాలా ఫేమస్ అయిన సోఫియా హయాత్.. ఆ తర్వాత సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. బ్రిటన్ లోని ముస్లిం కుటుంబంలో జన్మించిన సోఫియా.. యుక్తవయసులోనే బలవంతంగా పెళ్లి చేశారు. కానీ నటనపై ఆసక్తి ఉన్న సోఫియా బ్రిటన్ వదిలి ఇండియాకు చేరుకుంది. 2008లో క్యాష్ అండ్ కర్రీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత సిక్స్ ఎక్స్, అక్సర్ 2 వంటి చిత్రాల్లో నటించింది. 2013లో ఎఫ్ హెచ్ ఎమ్ సర్వేలో ప్రపంచంలోని అత్యంత గ్లామర్ మహిళల జాబితాలో ఎంపికైన ఏకైక నటిగా పేరు పొందింది. రోమేనియన్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సోఫియా… సంవత్సరంలోనే అతడితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నిరోజులు ఒంటరిగా ఉన్న సోఫియా… గ్లామర్ ప్రపంచాన్ని వదిలి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్లింది. భౌతిక ఆనందాల కంటే ఆధ్యాత్మికత మార్గమే ఉత్తమని, అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments