Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedKalki 2898 AD: ఆగని కల్కి కలెక్షన్స్ సునామి.. ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్..

Kalki 2898 AD: ఆగని కల్కి కలెక్షన్స్ సునామి.. ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డ్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ విధ్వంసం సృష్టిస్తుంది. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలో భారీ తారాగణం, ఊహించని ట్విస్టులకు ఫిదా అవుతున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.600 కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.950 కోట్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది. కల్కి కన్నా ఈ రికార్డును సాధించిన ఇండియన్ మూవీస్ ఆరు ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్కి సినిమా 7వ స్థానంలో నిలిచింది.

కల్కి సినిమా విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే నార్త్ అమెరికాలోనూ అరుదైన ఫీట్ ను కల్కి సినిమా సొంతం చేసుకుంది. 16.2 మిలయన్ డాలర్లు వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. బుక్ మై షోలో కోటికి పైగా టికెట్స్ విక్రయమైన సినిమాగా కొత్త రికార్డ్ సృష్టించింది ఈ మూవీ. ఇక ఈ వీకెండ్స్‏లో కల్కి వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నట విశ్వరూపం చూపించారు. దీంతో కల్కి సినిమాకు నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలలో మొదటి స్థానంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) మూవీ నిలిచింది. ఈ సినిమా రూ.2024 కోట్లు రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి 2 (2017) మూవీ రూ. 1810 కోట్లు రెండవ స్థానంలో ఉండగా.. జక్కన్న తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ (2022) మూవీ రూ.1387 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేజీఎఫ్ 2 (2022) రూ.1250 కోట్లు… షారుఖ్ ఖాన్ జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు రాబట్టిన చిత్రాలుగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏడవ స్థానంలో ప్రభాస్ నటించిన కల్కి ప్రాజెక్ట్ నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments