Friday, October 18, 2024
Google search engine
HomeUncategorizedగురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పేరు ఈ మధ్యకాలంలో తెగ వినిపిస్తుంది. ఈ పెద్దాయన సినిమా వాళ్ల జాతకాలు చెప్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విడాకుల గురించి, అనారోగ్య సమస్యల గురించి చేస్తూ పాపులర్ అయ్యారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య జంట విడిపోతారు అని చెప్పి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ జంట విడిపోయారు. ఆతర్వాత కూడా చాలా మంది గురించి రకరకాల కామెంట్స్ చేశాడు. అంతే కాదు స్టార్ హీరోయిన్స్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు . రష్మిక మందన్న, డింపుల్ హయతిలాంటి హీరోయిన్స్ తో పాటు  అషు రెడ్డి, ఇనాయ సుల్తానాలాంటి మరికొంతమంది బుల్లితెర బ్యూటీస్ కూడా ఆయనతో పూజలు చేయించుకున్నారు. అయితే రీసెంట్ గా ఆయన చెప్పిన జ్యోతిష్యం బెడిసికొట్టింది.

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై ఆయన చెప్పిన జ్యోతిష్యం తప్పు కావడంతో వేణుస్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు నెటిజన్స్. దాంతో ఇక పై రాజకీయాల గురించి జ్యోతిష్యం చెప్పను అని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు వేణు స్వామి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కామెంట్స్ చేశారు వేణుస్వామి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిజాస్టర్ అయినప్పుడు నాకు ఎవ్వరూ దండలేయలేదు అన్నారు. అలాగే కల్కి పై కూడా కామెంట్స్ చేశారు.

ఇది కూడా చదవండి : లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్.. ఐరెన్ లెగ్ అని తిట్టిపోశారు.. కట్ చేస్తే నేషనల్ అవార్డు అందుకున్నస్టార్ హీరోయిన్

బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు హిట్ అనేది రాదు ని అన్నారు మరి ఇప్పుడు కల్కి సినిమా హిట్ అయ్యింది ఏమంటారు.? అని ప్రశ్నించగా.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్ అయ్యాయి.. అప్పుడు నాకు ఎవ్వరూ దండలేసి కిరీటాలు పెట్టలేదు. అలాగే సలార్ సినిమా హిట్ అంటూ ఫ్యాన్స్ తెగ ఎగిరారు. ఆ సినిమా నిజంగా హిట్ అయ్యిందా.? ఆ సినిమాకు 130కోట్లు లాస్ వచ్చింది. ఇప్పుడు కల్కి హిట్ అంటున్నారు. ఆ సినిమాలో హీరో ఎవరు.? ప్రభాస్ ఎంత సేపు కనిపించాడు.? అసలు ఆ సినిమా హిట్టా.? నిర్మాతకు ఎంత డబ్బులు వస్తాయో చూద్దాం.! ప్రభాస్ మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాలు చేయగలడా.? అలాంటి పరిస్థితి లేదు అని విమర్శలు చేశారు వేణుస్వామి. ఇప్పుడు ఈ కామెంట్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments