Thursday, October 17, 2024
Google search engine
HomeUncategorizedActress Hema: బిగ్ ట్విస్ట్.. హేమ డ్రగ్స్ టెస్ట్‌లో షాకింగ్ రిజల్ట్.. 'మా'కు సంచలన లేఖ

Actress Hema: బిగ్ ట్విస్ట్.. హేమ డ్రగ్స్ టెస్ట్‌లో షాకింగ్ రిజల్ట్.. ‘మా’కు సంచలన లేఖ

రెండు నెలల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ప్రముఖ టాలీవుడ్ నటి హేమ పట్టుబడినట్లు అక్కడి పోలీసులు ప్రకటించడం టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది. ఆమె డ్రగ్స్ సేవించిందని, టెస్ట్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చిందంటూ పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత విచారణకు వచ్చిన నటిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆమె బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చింది. అయితే పోలీసులు హేమని అరెస్టు చేసిన తరువాత, ఆమెపై వచ్చిన ఆరోపణలు చూసి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) హేమ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసింది. అయితే ఈ విషయంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంచలన లేఖ రాసింది. అంతేకాదు మా అధ్యక్షుడు మంచు విష్ణును కలిసి స్వయంగా ఆ లెటర్ అందజేసింది. దీంతో పాటు డ్రగ్స్ టెస్ట్ కు సంబంధించి తన రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేసింది హేమ.

‘నేను సుమారు దశాబ్ద కాలంగా మా అసోసియేషన్ లో సభ్యురాలిగా ఉన్నాను. అలాంటిది తనకు ఎటువంటి షోకాజ్ నోటీసులు జారీ చేయకుండా, కనీసం వివరణ అడగకుంగా మా సభ్యత్వం నుంచి తొలగించడం అన్యాయం. బెంగళూరు రేవ్ పార్టీ ఉదంతంలో నాపై దుష్ప్రచారం జరిగింది. ఈ విషయంలో మా కూడా ఏకపక్షంగా వ్యవహరించింది. మా బైలాస్ ప్రకారం నాకు ముందుగా షోకాజ్ నోటీసు జారీ చేయాలి. కానీ అటువంటిదేమీ జరగలేదు. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన వివరణ సరైనది కానప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా మా నుంచి నన్ను తీసెయ్యడం చాలా పెద్ద తప్పు. ఇటీవలె నేను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో నాకు నెగిటివ్ వచ్చింది. త్వరలోనే‌ పోలీసులు జరిపిన పరీక్షల వివరాలు బయటకు వస్తాయి. అందుకని మళ్లీ ‘మా’లో నా సభ్యత్వాన్ని కొనసాగించాలి. ఎందుకంటే డ్రగ్స్ కేసు విషయంలో నాకు ‘మా’ సపోర్ట్ కావాలి’ అని లేఖలో పేర్కొంది హే.

కాగా హేమ‌ లేఖను తీసుకున్న మంచు విష్ణు దాననిఇ అడ్వైజరీ కమిటీకి పంపిస్తామని, తరువాత మా కమిటీ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హేమకు హామీ ఇచ్చిన్నట్టు తెలిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments