Wednesday, October 16, 2024
Google search engine
HomeUncategorizedMaharaja OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి మహారాజా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Maharaja OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి మహారాజా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

మక్కల్ సెల్వన్ సినిమాలకు పెద్దగా ప్రచారం అవసరం లేదు. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‏గా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టిస్తాయి. హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఈ హీరో చిత్రాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకుంటూ సెన్సెషన్ క్రియేట్ చేస్తాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటించిన మహారాజా కూడా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే సృష్టిస్తుంది. డైరెక్టర్ నితిలన్ సామినాథన్ తెరకెక్కించిన ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. మక్కల్ సెల్వన్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన మహారాజా చిత్రానికి అడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఓవైపు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను కల్కి చిత్రం ఏలేస్తున్న తమిళనాడులో మాత్రం మహారాజా సినిమా గట్టి పోటినిస్తుంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు మమతా మోహన్‌దాస్, అభిరామి, దివ్య భారతి, అనురాగ్ కశ్యప్, సింగం పులి, నట్టి, మునీస్కాంత్, బాయ్జ్ మణికందన్ తదితరులు నటించారు. సమాజంలో అమ్మాయిలపై లైంగిక వేధింపుల సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో మరోసారి తన నటనతో కట్టిపడేశాడు విజయ్ సేతుపతి. విడుదలైన మొదటి పది రోజుల్లోనే రూ.81 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ దాటే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం తమిళనాడులో ఈ సినిమా థియేటర్లను షేక్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటివరకు మహారాజా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనేక రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఫిల్మ్ వర్గాల్లో మహారాజా ఓటీటీ విడుదల గురించి ఓ ఆసక్తికర న్యూస్ వైరలవుతుంది. అసలు విషయమేంటంటే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహారాజా చిత్రం ఈ నెల 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. ఈ విషయంపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments