Thursday, December 26, 2024
Google search engine
HomeUncategorizedహీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్

హీరోయిన్‌కు చేదే అనుభవం.. బికినీ వేసుకోలేదని ఫోటోగ్రాఫర్ సీరియస్

మనీషా కోయిరాలా..! ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మనీషా.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ సమస్యతో పోరాడి గెలిచింది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవల డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హిరామండి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ ప్రియులను అలరించింది. ఇక ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె తన కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు ఓ అనుభవాన్ని గుర్తు చేసుకుని బాధపడింది. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మనీషా ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే..! “కెరీర్ ప్రారంభంలో ఫోటోషూట్స్ చేస్తామని కొందరు అడిగేవారు. ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్ నాపై తెగ ప్రశంసలు కురిపించాడు. నేను కచ్చితంగా సూపర్ స్టార్ అవుతానని అన్నాడు. ఆ తర్వాత టూ పీస్ బికినీ వేసుకుంటావని ఆ ఫోటోగ్రాఫర్ అడిగితే.. సినిమాల్లో అవకాశాల కోసం నేను ఇలాంటి డ్రెస్ వేసుకోను అని నిర్మొహటంగా చెప్పేశాను. దీంతో ఆయన నన్ను గట్టిగా తిట్టాడు. కరగడానికి నిరాకరించే మట్టిముద్ద నుంచి ఎవరూ బొమ్మను తయారు చేయలేరు అని వెళ్లిపోయాడు. అతడి మాటలను నేనెప్పటికీ మర్చిపోలేను. అందరి మనస్తత్వం ఒకేలా ఉండదని అప్పుడే అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత నా సినిమాలు హిట్ అయ్యాక.. నేను పెద్ద సెలబ్రెటీ అయ్యాక అతడే వచ్చి నా ఫోటోషూట్ చేశాడు” అంటూ గుర్తుచేసుకుంది మనీషా.!

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Darshan: బిగుస్తోన్న ఉచ్చు.. దారుణంగా హీరో పరిస్థితి ??

Indian 2: భారతీయుడు2 పై మర్మకళ వివాదం రిలీజ్‌ అవుతుందా ?? లేదా ??

Mahesh Babu: ‘అద్భుతం.. జస్ట్‌ వావ్‌’ కల్కి కి మహేష్ సూపర్ రివ్యూ…

TOP 9 ET News: హాలీవుడ్‌లో కల్కి ప్రభంజనం కెనడాలో ఏకంగా దిమ్మతిరిగే కలెక్షన్స్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments