Tuesday, December 24, 2024
Google search engine
HomeUncategorizedసుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??

సుధీర్ బాబుకు బిగ్ ఝలక్.. ప్రాబ్లం ఏమై ఉంటుంది ??

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో, నవ దళపతి సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హరోం హర. జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ జూన్ 14న థియేటర్లలో రిలీజైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ ఎందుకనో ఎక్కువ రోజులు థియేటర్లలో ఆడలేకపోయింది. ఇక ఓవరాల్ గా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న సుధీర్ బాబు సినిమా జులై 11న ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ ఈ విషయంలోనూ ఈ సినిమా డిస్సపాయింట్ చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ కూడా హరోం హర మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నాయి. జులై 11 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు అధికారిక ప్రకటనలు కూడా ఇచ్చేశాయి. అయితే ఇప్పటివరకు హరోం హర సినిమా ఏ ఓటీటీలోనూ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

SSMB29: మహేష్ బాబు – రాజమౌళి సినిమాకు.. ఆషాఢం ఎఫెక్ట్..

శుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్‌.. సీరియస్‌గా రియాక్టైన సందీప్‌ కిషన్

Ram Charan: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్‌ తో మామూలుగా ఉండదు మరి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments