Wednesday, December 4, 2024
Google search engine
HomeUncategorizedబీరు బాటిల్‌తో తలపగలగొట్టాడు.. 15 కుక్కల మధ్య ఆమెను వదిలేశాడు: లావణ్య న్యాయవాది

బీరు బాటిల్‌తో తలపగలగొట్టాడు.. 15 కుక్కల మధ్య ఆమెను వదిలేశాడు: లావణ్య న్యాయవాది

టాలీవుడ్‌ నటుడు రాజ్‌తరుణ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో A1గా రాజ్‌తరుణ్‌ ఉంటే.. A2గా మాల్వీ మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగి పోలీసులు. ఆ విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ FIR కాపీని టీవీ9 సంపాదించింది. రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మయాంక్‌ మల్హోత్రాపై 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కంప్లైంట్‌ కాపీలో లావణ్య చాలా విషయాల్ని ప్రస్తావించింది. రాజ్‌తరుణ్ తనకు ఎప్పుడు పరిచయం అనే దగ్గర మొదలుపెట్టి.. ఇటీవలి వరకూ ఏం జరిగిందో పేర్కొంది.

ఇది కూడా చదవండి : గురువుగారూ..! ప్రభాస్ ఫ్యాన్స్‌తో పెట్టుకోకండీ..! కల్కి సినిమా హిట్ కాదంటుంటున్న వేణు స్వామి

2008 నుంచి రాజ్‌తరుణ్‌తో తనకు పరిచయం ఉందనేది లావణ్య వాదన. 2010లో రాజ్‌తరుణ్‌ లవ్ ప్రపోజ్‌ చేశాడు.. 2014లో తనను పెళ్లి చేసుకున్నాడని చెప్తోంది.  రాజ్‌తరుణ్‌కు తాను గతంలో 70 లక్షలు ఇచ్చానంటోంది.  2016లో రాజ్‌తరుణ్‌ వల్ల తాను గర్భవతిని అయ్యానని, రెండో నెలలోనే తనకు సర్జరీ చేశారని అంటోంది.. అప్పుడు హాస్పిటల్ బిల్లులన్నీ రాజ్‌తరుణే చెల్లించాడంటోంది లావణ్య. గతంలో తనపై ఉన్న డ్రగ్స్‌ కేసును కూడా ప్రస్తావించింది. ఆ కేసులో రాజ్‌తరుణ్, మాల్వీ తనను ఇరికించారని ఆరోపించింది. తనను మోసం చేసిన రాజ్‌తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. మాల్వీ మల్రోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ మల్రోత్రా తనను చంపుతామని బెదిరించారంటోంది. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగబోదంటున్న లావణ్య.. మరిన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తానంటోంది.

ఇది కూడా చదవండి : Ramya Sri : బీ గ్రేడ్ సినిమాలో చేయమని ఆఫర్ చేశారు.. వాళ్ళందరూ పతివ్రతలు కాదు.. రమ్యశ్రీ బోల్డ్ కామెంట్స్

ఇదిలా ఉంటే లావణ్య తరుపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజ్ తరుణ్ పైకి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు కానీ అతను లావణ్యకు చాలా అన్యాయం చేశాడని అన్నారు దిలీప్. అలాగే 700కి పైగా ఆధారాలను పోలీసులకి సమర్పంచినట్లుగా ఆయన చెప్పారు. లావణ్యకు కడుపు చేయడంతో పాటు ఆమెను చిత్రహింసలు పెట్టాడని.. బీరు బాటిల్స్ తో కొట్టాడని అన్నారు దిలీప్. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ లావణ్యను వాడుకున్నాడు. ఈ 11 ఏళ్లలో ఆమె రెండు సార్లు గర్భవతి అయితే అబార్షన్ చేయించాడు. రాజ్ తరుణ్ ను బ్లాక్ మెయిల్ చేయడానికి లావణ్య కేసు పెట్టలేదు. ముందు నటి మాల్వీ మల్హోత్రా తనకు చంపుతానని బెదిరించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అసలు ఆమె ఎవరు.? అని ఆరా తీస్తే రాజ్ తరుణ్ యవ్వారం బయటకు వచ్చింది అని అన్నారు దిలీప్. రాజ్ తరుణ్ చాలా తెలివైనవాడు.. పెళ్లి మ్యాటర్ ఎక్కడ బయటకు వస్తుందో అని మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది అంటూ కొత్త కథ సృష్టించాడు. ఆ అమ్మాయి ఇమేజ్ ను డామేజ్ చేసేలా.. ముందు వెనక కట్ చేసి ఆమె మాట్లాడిన బూతులు మాత్రమే చూపిస్తూ.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. నమ్మించి మోసం చేస్తే బూతులు మాట్లాడక నీతులు మాట్లాడుతుందా.? కడుపు రగిలిన అమ్మాయి.. కడుపు తీయుంచుకున్న అమ్మాయి బూతులు మాట్లాడతంలో తప్పు ఏముంది. లావణ్య నెత్తి మీద బీర్ బాటిల్ పగలగొట్టిన రాజ్ తరుణ్‌ను ఏం చేయాలి. ? ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఇంట్లో 15 కుక్కలు ఉన్నాయి. వాటిని వదిలి పారిపోయాడు. ఆ కుక్కలను ఇప్పుడు లావణ్య చూసుకుంటుంది. ఒక ఆడపిల్లను ఇలా కుక్కలా మధ్య వదిలేసి వెళ్లిన రాజ్ తరుణ్ నీచమైన కామెంట్లు చేస్తున్నాడు. అన్ని విషయాలు కోర్ట్ తేలుస్తుంది అని అన్నారు దిలీప్ సుంకర.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments