Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్.

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్.

ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయిన జంటలు చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నాయి. తమ మాజీ పార్టర్న్స్ మరో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతుంటే.. అసలు నో మ్యారేజ్ అంటూ సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో బీటౌన్ బుల్లితెర హీరోయిన్ జెన్నిఫర్ ఒకరు. బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈమె…నిజ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది. రంగుల ప్రపంచంలో స్టార్ నటిగా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఈమెకు పర్సనల్ లైఫ్ లో షాక్ తగిలింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మరో అమ్మాయితో రిలేషన్ ఉందని తెలిసి.. అతడిని అందరి ముందు చెంపదెబ్బ కొట్టింది. పెళ్లైన ఏడాదికే విడాకులు తీసుకుని ఇప్పుడు సింగిల్ గా తన లైఫ్‌ లీడ్ చేస్తోంది. తన తీరుతో ఇప్పుడు బీటౌన్ టెలివిజన్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతోంది.

సీరియల్ ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన జెన్నిఫర్ వింగెట్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో చాలా కష్టమైన సమయాలను ఎదుర్కొన్నప్పటికీ ఎన్నడూ చలించలేదు. విడాకుల తర్వాత ఇప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. హిందీలో దిల్ మిల్ గయే, బేహాద్, కహిన్ తో హోగా, బేపన్నా వంటి సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది. నటిగా చాలా ఫేమస్ అయిన జెన్నిఫర్ మాత్రం జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. చిన్న వయసులోనే నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకుంది. వీరిద్దరూ సీరియల్ షూటింగ్ ద్వారా పరిచయమయ్యారు.

ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కానీ ఏడాదికే విడాకులు తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే.. తన భర్త మోసం చేశాడని.. అతడు మరో నటితో రిలేషన్ లో ఉన్నాడని జెన్నిఫర్ అంటోంది. తన భర్త ప్రియురాలితో సరదాగా మాట్లాడుతుండగా.. అతడిని అందరి ముందు సెట్ లో కొట్టిందట. ఈ వార్త అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కరణ్ సింగ్ తనను మోసం చేశాడని తెలిసి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యిందట. దీంతో 10 నెలల్లోనే భర్తతో విడాకులు తీసుకుంది. 2014లో భర్తతో విడిపోయిన జెన్నిఫర్ ఇప్పటికీ ఒంటరిగానే గడుపుతోంది. తన తీరుతో.. ఇప్పటికీ వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments