యుటీబల్ ప్రణీత్ హనుమంత్ ను ఇటీవలే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తండ్రి, కూతురు బంధంపై చీప్ కామెంట్స్ చేసి జైలుపాలు అయ్యారు ప్రణీత్. సోషల్ మీడియాలో తండ్రి, కూతుర్ల రిలేషన్ పై అభ్యంతరకర కామెంట్స్ చేశాడు హనుమంతు. అతని పై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు హనుమంతు పై ఫైర్ అయ్యారు. పెద్దెత్తున విమర్శలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు. తాజాగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్‌పై మరో కేసు నమోదు అయ్యింది.
ప్రణీత్ గంజాయి సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ రావడంతో అతడిపై NDPS కింద కేసు పెట్టారు పోలీసూలు. ప్రణీత్‌ను మూడు రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ప్రణీత్ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది కోర్టు. తండ్రి, కూతుర్ల బంధంపై యూట్యూబ్‌లో దారుణమైన కామెంట్స్ చేసిన ప్రణీత్ హనుమంత్..ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు.