నీ ధైర్యానికి సలాం..! ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా షూటింగ్‌లో పాల్గొన్న నటి

0
32
నీ ధైర్యానికి సలాం..! ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా షూటింగ్‌లో పాల్గొన్న నటి

నీ ధైర్యానికి సలాం..! ఓ వైపు క్యాన్సర్ బాధిస్తున్నా షూటింగ్‌లో పాల్గొన్న నటి

చాలా మంది నటులు/నటీమణులకు సినిమాల పట్ల విపరీతమైన ప్రేమ ఉంటుంది. అందుకే అనారోగ్యంతో ఉన్నా షూటింగ్‌కి మాత్రం డుమ్మా కొట్టరు చాలా మంది. కొంతమంది షూటింగ్స్ లో ఎన్ని గాయాలు అయినా కూడా లెక్క చేయకుండా.. షూటింగ్స్‌లో పాల్గొంటారు. ఇక ఇప్పుడు ఓ హీరోయిన్ ఏకంగా తన క్యాన్సర్ అని తెలిసి కూడా దానికి చికిత్స చేయించుకుంటూనే సినిమా షూటింగ్ లో పాల్గొంది. ఆమె ధైర్యాన్ని నెటిజన్ కొనియాడుతున్నారు. నువ్వు ఎంతోమందికి స్ఫూర్తి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘యే రిష్తా క్యా కెహ్తే హై’, ‘కసౌతీ జిందగీకి కే’ లాంటి బాలీవుడ్ సీరియల్స్‌లో నటించిన హీనా ఖాన్ ఇటీవలే క్యాన్సర్‌తో బారినపడిన విషయం తెలిసిందే. ఆమె క్యాన్సర్ బారిన పడిందని తెలిసి చాలా మంది షాక్ అయ్యారు. ఆమె అభిమానులు హీనా ఖాన్ త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. అయితే దీని నుంచి ఆమె పూర్తిగా కోలుకోకముందే తిరిగి షూటింగ్ కు వచ్చింది.

ఇటీవల, హీనా ఖాన్ తన రొమ్ము క్యాన్సర్ గురించి సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాదు క్యాన్సర్ మూడో స్టేజ్ కు చేరుకుందని తెలిపింది. ఇప్పుడు దాని నుండి పూర్తిగా కోలుకోవడం ఆమెకు సవాలుగా మారింది. కేన్సర్‌తో బాధపడుతూ కూడా ఆమె సినిమాలను వదలడం లేదు.. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.

‘క్యాన్సర్‌తో బాధపడుతున్న తర్వాత నా మొదటి రోజు. మనం చెప్పాలనుకున్నది చేయడం నిజమైన సవాలు. చెడు రోజులలో విశ్రాంతి తీసుకోండి. నువ్వు దానికి అర్హుడవు. మంచి రోజుల్లో జీవించడం మర్చిపోవద్దు. మంచి రోజులు ఎంత తక్కువైనా, ఆ రోజులు చాలా ముఖ్యమైనవి. మార్పును అంగీకరించండి’ అని వీడియోలో తెలిపింది. క్యాన్సర్ నుంచి బయటపడటం పెద్ద సవాల్‌. అయినప్పటికీ, హీనా ఖాన్ ఎంతో దైర్యంగా ఉంది. ఆమె తనను తాను పనిలో బిజీగా ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. దాంతో హీనా ఖాన్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here