Wednesday, December 25, 2024
Google search engine
HomeUncategorizedనాన్నకు మూడు పెళ్లిళ్లు.. కొడుక్కు ఒక్క పెళ్లి లేదు.. ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిన నరేష్ కొడుకు

నాన్నకు మూడు పెళ్లిళ్లు.. కొడుక్కు ఒక్క పెళ్లి లేదు.. ట్రోలర్స్‌కు గట్టిగా ఇచ్చిన నరేష్ కొడుకు

సీనియర్ నటుడు నరేష్ ఆమధ్య తెగ వార్తల్లో నిలిచారు. పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోవడంతో ఆయన పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. నరేశ్ పవిత్రను పెళ్లి చేసుకోవడంతో ఆయన మాజీ భార్య.. రమ్య రఘుపతి పెద్ద గొడవే చేశారు. ఈ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఆమె వీరి పై ముఖ్యంగా నరేష్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది ఆమె. ఓహొటల్ దగ్గర ఈ ఇద్దరూ కలిసి కనిపిస్తే ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. ఇక ఇప్పుడు ఈ గొడవలన్నీ సద్దుమణిగాయి.. నరేష్ పవిత్రలోకేష్ కలిసి జీవిస్తున్నారు. ఇదిలా ఉంటే నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ గుర్తున్నాడా.? హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవీన్ ఎక్కువగా సినిమాలు చేయలేదు.

“నందిని నర్సింగ్ హోమ్” సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు నవీన్. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఈ సినిమాలో నటన పరంగానూ నవీన్ మెప్పించాడు. ఆ తర్వాత చాలా కాలానికి “ఊరంతా అనుకుంటున్నారు” అనే సినిమా చేశాడు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే నవీన్ ఈ రెండు సినిమాలంటే ముందు కీర్తిసురేష్ హీరోయిన్ గా ఓ సినిమా చేశాడు. ఆ సినిమానే “రెండుజెళ్ళ సీత” ఈ సినిమా చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. ఇదిలా ఉంటే నవీన్ తాజాగా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కొడుక్కు పెళ్లి చేయకుండా నరేష్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దీని పై నవీన్ స్పందించాడు. నేను ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోనూ.. పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తుంటే ఉంటాయి. ట్రోల్స్ చేసే వారిని ఆపలేం. అయినా నా పెళ్లి గురించి నాకు క్లారిటీ ఉంది. నా కెరీర్ బాగుంది.. అని నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. నాకు చేసుకోవాలి అనిపించినప్పుడు చేసుకుంటా.. లేకుంటే ఇక ఇంతే అని అన్నాడు నవీన్. ప్రస్తుతానికి నేను సింగిల్.. మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా.. మా నాన్నకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి ..నాకు అవ్వడం లేదు అనే ట్రోల్స్‌ను నేను పట్టించుకోను అని అన్నాడు నవీన్. ఈ కామెంట్స్ తో ట్రోల్ చేసే వారి నోరు మూయించే ప్రయత్నం చేశాడు నవీన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments