చిన్న సినిమా పెద్ద విజయం.. స్టార్ హీరోలు లేకుండా వందకోట్లు వసూల్ చేసిన మూవీ

0
34
చిన్న సినిమా పెద్ద విజయం.. స్టార్ హీరోలు లేకుండా వందకోట్లు వసూల్ చేసిన మూవీ

చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చడీ చప్పుడూ లేకుండా వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటు భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. అన్ని భాషల్లో చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తమదైన స్టైల్ లో విజయాలు సాధిస్తున్నారు. కాగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు దారుణంగా నిరాశపరుస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. ఇదిలా ఉంటే స్టార్ ఆర్టిస్టులు లేని ఓ చిన్న సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్ సినిమా ‘ముంజ్యా’ సూపర్ హిట్ సొంతం చేసుకుంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. స్టార్ నటీనటుల సినిమాల్లో కూడా ‘మంజ్యా’ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ‘ముంజ్యా’ సినిమాపై అంతగా క్రేజ్ లేదు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జూన్ 7న ‘ముంజ్యా’ థియేటర్లలో విడుదలైంది. మొదటి షోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఆదిత్య సర్పోత్దార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకుడు చెప్పిన హారర్ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శర్వరీ వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ‘ముంజ్యా’ తొలిరోజు వసూళ్లు రూ.4.21 కోట్లు. రెండో రోజు 7.40 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు 8.43 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత రోజుకి 3, 4 కోట్ల రూపాయల వసూళ్లతో సినిమా దూసుకెళ్లింది. వీకెండ్స్ లో కలెక్షన్లు పెరిగాయి. సక్సెస్ ఫుల్ గా 25 రోజుల తర్వాత ఈ సినిమా టోటల్ కలెక్షన్ 100 కోట్ల రూపాయలను దాటేసింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇటీవల విడుదలైంది. హిందీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ‘కల్కి 2898 AD’ విడుదలైన తర్వాత ‘ముంజ్యా’ కలెక్షన్లు పడిపోయాయి. అప్పటికే  100 కోట్ల గ్రాస్ కలెక్ట్  చేసింది ముంజ్యా. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. త్వరలోనే ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here