Saturday, January 4, 2025
Google search engine
HomeUncategorizedఒళ్లును విల్లులా వంచిన ఈ వగలాడి ఎవరో గుర్తుపట్టారా..? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె

ఒళ్లును విల్లులా వంచిన ఈ వగలాడి ఎవరో గుర్తుపట్టారా..? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె

సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే చాలా మంది ముద్దుగుమ్మలు యాక్టివ్ గా ఉంటారు. చేసేది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంటారు కొంతమంది వయ్యారి భామలు. ఇక ఈ ముద్దుగుమ్మలు అందం కోసం, ఫిట్ నెస్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం ఇలా జిమ్ లో చమట్లు చిందిస్తూ ఉంటారు. పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? అందానికి కేరాఫ్ అడ్రస్ ఆ బ్యూటీ. ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు బాగానే గుర్తుండిపోయే పాత్రలు చేసింది. నటనలోనే కాదు అందంలోనూ ఈ బ్యూటీ తనకు తానే సాటి అని నిరూపిస్తుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

ఇది కూడా చదవండి :Sai Pallavi: దట్ ఈజ్ సాయి పల్లవి..! ఆ టాలీవుడ్ హీరో అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమట..

పై ఫొటోలో జిమ్ లో కసరత్తులు చేస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. టాలీవుడ్ నటి నందిని రాయ్. ఈ అమ్మడు మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది.  80కిపైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్‌గా నటించిన నందిని. 2008లో మిస్ హైదరాబాద్ 2008, 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్, 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా చాలా అవార్డులు అందుకుంది ఈ అమ్మడు.

ఇది కూడా చదవండి : దుమ్మురేపిన డాడీ మూవీ పాప.. అందాలతో అదరగొట్టిన బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

2011లో వచ్చిన ఫ్యామిలీ ప్యాక్ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆతర్వాత హార్మోన్స్ అనే సినిమా చేసింది. మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని, పంచతంత్ర కథలు, భాగ్ సాలే సినిమాల్లో నటించింది. అలాగే దళపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమాలోనూ ఈఅమ్మడు నటించింది. ఇక సోషల్ మీడియాలో నందిని రాయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడి హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

నందిని రాయ్ ఇన్ స్టా…

నందిని రాయ్ ఇన్ స్టా…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments