సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఆ మధ్య టిక్ టాక్ అంటూ కొంతమంది పిచ్చి పిచ్చి చేష్టలు చేశారు. మరికొంతమంది ఏకంగా ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. దాంతో మనదగ్గర ఆ మాయదారి యాప్‌ను మనదగ్గర బ్యాన్ చేశారు. ఇక ఇప్పుడు అందరూ ఇన్ స్టా గ్రామ్ మీద పడ్డారు. ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ రీల్స్ చూస్తుంటే అమ్మబాబోయ్ అనకుండా ఉండలేరు. ఎక్కడ లేని టాలెంట్ అంతా ఈ ఇన్ స్టా గ్రామ్‌లోనే కనిపిస్తుంది. కొంతమంది తమ యాక్టింగ్‌తో, డాన్స్‌తో, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం పిచ్చి పిచ్చిచేష్టలతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు. సినిమాలో హీరోలను చూసి వారిలానే వీడియోలు చేసి పాపులర్ అవ్వాలనుకుంటున్నారు. తాజాగా ఇలానే ఓ వ్యకి చేసిన పనికి జనాలు షాక్ అయ్యారు.
సోషల్ మీడియా పిచ్చితో కొంతమంది చేసే పనులు కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్ని సార్లు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా అరుణ్ కటారే అనే వ్యక్తి అరెస్టయ్యాడు. డమ్మీ తుపాకీని ఉపయోగించి పబ్లిక్‌గా రీల్స్ తయారు చేసినందుకు బెంగుళూరులోని కొత్తనూరు పోలీసులు అరెస్టు చేశారు. వీధుల్లో తుపాకీ పట్టుకుని తిరుగుతూ హల్ చల్ చేశాడు. అతడిని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దాంతో పోలీసులు అరుణ్‌ని అరెస్టు చేశారు. అరుణ్ తప్పిదం వల్ల ఇప్పుడు శాండల్ వుడ్ కష్టాల్లో పడింది. కన్నడ హిట్ సినిమాలకు డమ్మీ గన్స్ అందించే టెక్నీషియన్ సాహిల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు
హోంబలే ఫిల్మ్స్, గీతా పిక్చర్స్ వంటి బ్యానర్ల సినిమాలకు సాహిల్ డమ్మీ గన్‌లు ఇచ్చేవాడు. ‘కబ్జా’, ‘మఫ్తీ’ వంటి కన్నడ సూపర్ హిట్ సినిమాల్లో తుపాకులను విరివిగా వాడారు. ఈ సినిమాలకు సాహిల్ డమ్మీ గన్ అందించాడు. అరుణ్ అనే వ్యక్తి చేసిన పనికి సాహిల్ కి నోటీసు ఇచ్చారు పోలీసులు. అరుణ్ కటారే సాహిల్ దగ్గర డమ్మీ తుపాకీని అద్దెకు తీసుకున్నాడు. ఈ తుపాకీని పబ్లిక్ ప్లేస్‌లో రీల్స్ చేసేందుకు ఉపయోగించారు. సాహిల్‌పై ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో అరుణ్‌ని కొత్తనూరు పోలీసులు అరెస్టు చేశారు. అరుణ్‌ని విచారించగా, సాహిల్ నుంచి డమ్మీ గన్ తీసుకున్నట్టు తెలిపాడు. దీంతో కొత్తనూరు పోలీసులు సాహిల్‌కు నోటీసులు ఇచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.