Monday, January 6, 2025
Google search engine
HomeUncategorizedఉదయ్ కిరణ్‌కు పోటీగా అల్లు అర్జున్‌తో ఆ సినిమా చేయాలనుకున్న తేజ.. కానీ చివరకు

ఉదయ్ కిరణ్‌కు పోటీగా అల్లు అర్జున్‌తో ఆ సినిమా చేయాలనుకున్న తేజ.. కానీ చివరకు

ఉదయ్ కిరణ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లవర్ బాయ్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ ఎంట్రీతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. ఉదయ్ నటించిన మొదటి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. తేజ తీసిన చిత్రం సినిమా ద్వారా పరిచయమయిన ఉదయ్ కిరణ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ పై వచ్చిన నువ్వు నేను. మనసంతా నువ్వే కూడా వరుసగా హిట్ అయ్యాయి. నువ్వు నేను సినిమాలోని నటనకు 2001 ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నాడు ఉదయ్. అయితే దర్శకుడు తేజతో ఉదయ్ కు నువ్వు నేను షూటింగ్ స‌మ‌యంలో మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చాయట. అయితే అదే సమయంలో తేజ ఉదయ్ ను కాదు అని నితిన్ తో జయం సినిమా చేశాడు.

ఇది కూడా చదవండి : దుమ్మురేపిన డాడీ మూవీ పాప.. అందాలతో అదరగొట్టిన బ్యూటీ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

అప్పుడే ఉదయ్ విఎన్ ఆదిత్యతో శ్రీరామ్ అనే సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్ తో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డాయి. అయితే అప్పట్లో కావాలనే ఈ రెండు సినిమాలను పోటా పోటీగా రిలీజ్ చేశారని టాక్ ఉంది. అలాగే మరో రూమర్ ఏంటంటే శ్రీరామ్ సినిమాలో ధర్మవరకు సుబ్రహ్మణ్యం పేరు తేజ.. సినిమాలో ఈ పాత్రను ఎప్పుడూ తిడుతూ ఉంటారు. అయితే తేజ పై కోపంతోనే అలా చేశారని అని అప్పట్లో టాక్ ఉండేది.

ఇది కూడా చదవండి :Sai Pallavi: దట్ ఈజ్ సాయి పల్లవి..! ఆ టాలీవుడ్ హీరో అంటే ఈ అమ్మడికి చాలా ఇష్టమట..

ఇదిలా ఉంటే జయం సినిమాకు ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలనుకున్నాడట తేజ. అయితే ఎందుకనో అది సెట్ అవ్వలేదు. దాంతో ఆప్రాజెక్ట్ ను నితిన్ తో చేశాడట తేజ. జయం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు శ్రీ రామ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. జ‌యం ఫ‌స్ట్ డే నుండే బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ అందుకుంది. ఈ సినిమాలో నటించిన నితిన్, హీరోయిన్ సదా, విలన్ గా చేసిన గోపీచంద్ ఇలా అందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మంచి ఆఫర్స్ అందుకొని టాలీవుడ్ లో స్థిరపడ్డారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments