టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లోకి రాకపోయినా ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ స్టార్ కిడ్. ఓ బ్రాండెడ్ నగల కంపెనీ ప్రమోషన్ యాడ్ లో నటించిన సితార మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాల్లో తళుక్కున మెరిసింది. ఇక సేవా కార్యక్రమాల్లోనూ తండ్రి మహేశ్ బాబు అడుగు జాడల్లోనే నడుస్తోంది సితార. ఇందులో భాగంగానే తనకు వచ్చిన రెమ్యునరేషన్ ను సేవా కార్యక్రమాలకు వెచ్చించింది. అలాగే పేద విద్యార్థినులకు సైకిళ్లు అందజేయడం, బహుమతులు ఇవ్వడం.. ఇలా పలు సందర్భాల్లో తన గొప్ప మనసు చాటుకుంది. ఇక తాజాగా మరో సారి కూడా అదే పని చేసింది. జులై 20 తన పుట్టిన రోజు సందర్భంగా మెడిసిన్ చదవాలనుకున్న ఒక పేద విద్యార్థినికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచింది మహేష్ తనయ సితార. 2024లో జరిగిన మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నీట్ పరీక్షలో నవ్యశ్రీ అనే అమ్మాయి 605 మార్కులు సాధించింది. ఒక సాధారణ కళాశాలలోనే చదివిన ఆమె తన ప్రతిభతో టాప్ స్కోర్ సాధించింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. అయితే పేదరికం ఆమె కలలకు అడ్డుగా నిలిచింది. కనీసం పుస్తకాలు, హాస్టల్ ఫీజు, కనీస కాలేజీ ఫీజులు కూడా చెల్లిచలేని స్థితిలో నవ్య కుటుంబం ఉంది. దీంతో ‘నా చదువకు సాయం చేయాలి’ అంటూ మహేష్ బాబు ఫౌండేషన్, సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌ను నవ్య సంప్రదించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: