Wednesday, January 1, 2025
Google search engine
HomeUncategorizedశుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్‌.. సీరియస్‌గా రియాక్టైన సందీప్‌ కిషన్

శుచీ శుభ్రం లేని స్టార్ హీరో రెస్టారెంట్‌.. సీరియస్‌గా రియాక్టైన సందీప్‌ కిషన్

సందీప్ కిషన్ నడుపుతోన్న వివాహ భోజనంబు రెస్టారెంట్ లో జులై 10 న ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారని ఒక వార్త బాగా వైరలయ్యింది. అంతేకాదు అక్కడ కాలం చెల్లిన ఆహార పదార్థాలు దొరికాయని, హోటల్‌ లో శుచి, శుభ్రతా, నాణ్యత లేదని కథనాలు ప్రసారమయ్యాయి. తాజాగా ఈ విషయంపై హీరో సందీప్ కిషన్ స్వయంగా స్పందించారు. తన రెస్టారెంట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగానే అన్ని విషయాల మీద సందీప్ క్లారిటీ ఇచ్చాడు. నెట్టింట కనిపిస్తోన్న కొన్ని ఫొటోలు తమ కిచెన్ కి సంబంధించినవి కావాని, అయినా తమ కిచెన్ లోని ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారని సందీప్ స్పష్టం చేశారు. మీడియా మిత్రలు ఆసక్తికరమైన హెడ్ లైన్స్ పెట్టి వార్తలు రాసే ముందు నిజాలు తెలుసుకోవాలన్నారు. తాము గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు అనే పేరుతో చాలా నమ్మకమైన సేవలు అందిస్తూ వస్తున్నామని.. మీ ప్రేమాభిమానాలను ఎప్పుడూ వృధా కానీవ్వలేదన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: 7.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్.. చరణ్‌ తో మామూలుగా ఉండదు మరి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments