లిప్ లాక్ సీన్ చేయమంటే ఈ హీరోయిన్ చేసిన పనికి అంతా షాక్.. దెబ్బకు ఆ సన్నివేశాన్నే మార్చేశారట

0
21
లిప్ లాక్ సీన్ చేయమంటే ఈ హీరోయిన్ చేసిన పనికి అంతా షాక్..

సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటుంది. ఇప్పుడు జనరేషన్ ను బట్టి అంతా మారిపోతూ ఉంటుంది. ఒకప్పుడు సినిమాలకు ఇప్పటి సినిమాలకు చాలా చేంజ్ కనిపిస్తూనే ఉంటుంది. అప్పట్లో హీరోయిన్స్ ను చాలా పద్దతిగా చూపించే వారు.. కానీ ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ కేవలం గ్లామర్ షో కోసమే అన్నట్టుగా సినిమాలు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రొమాంటిక్ సీన్స్ , లిప్ లాక్స్, బోల్డ్ డైలాగ్స్ లాంటివి చాలా కామన్ అయిపోయాయి. సినిమాకు అవసరం అనుకుంటే హీరోయిన్స్ దేనికైనా సై అంటున్నారు. కొంతమంది బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోతున్నారు. మరికొంతమంది ఏకంగా అంతకు మించి అనేలా కూడా నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడే ఆ పనికి రెడీ అయిన ప్రేమలు బ్యూటీ.. షాక్‌లో ఫ్యాన్స్

మొన్నటివరకు పద్దతికి కేరాఫ్ అడ్రస్ లా ఉన్న అనుపమ పరమేశ్వరన్ కూడా టిల్లు స్క్వేర్ సినిమాలో తన అందాలతో అదరగొట్టింది. ఓ రేంజ్‌లో గ్లామరస్ షోతో ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం గ్లామర్ షోకి నో చెప్తూ మంచి మంచి ఆఫర్స్ ను మిస్ చేసుకుంటున్నారు. సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ గ్లామర్ షోకు నో చెప్తూ మంచి ఆఫర్స్ అందుకుంటూ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా రొమాంటిక్ సీన్స్ , ముద్దు సెన్స్ కు ఓ చెప్తుంది. దాని వల్ల చాలా సినిమా ఆఫర్స్ మిస్ చేసుకున్నా అని చెప్పింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :Nandamuri Mokshagna: ఇదెక్కడి మాస్ రా మావా..!! నందమూరి మోక్షజ్ఞకు జోడీగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్

తెలుగు నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాలో హీరోయిన్ గా చేసిన శృతి శర్మ. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు ఈ అమ్మడి. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. చాలా కాలం తర్వాత హీరమండి సిరీస్ లో చిన్న పాత్రలో కనిపించింది. తాజాగా శృతి శర్మ మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ స్క్రీన్ పైన బోల్డ్‌గా నటించను. నాకు రొమాంటిక్ సీన్స్, కిస్సింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే చాలా ప్రాజెక్ట్స్ వదిలేశాను అని తెలిపింది. హీరమండి గురించి మాట్లాడుతూ..డైరెక్టర్ కథ చెప్పినప్పుడు నా పాత్ర పూర్తిగా చదువుకున్నా.. ముద్దు సన్నివేశాలు ఉన్నాయని తెలిసి కన్నీళ్లు పెట్టుకున్నాను. అది తెలిసి దర్శకుడు సంజయ్ లీల బన్సాలి ఆ సీన్స్ తొలగించారు అని తెలిపింది శృతి శర్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here