దర్శన్ నాకు పెద్ద కొడుకులాంటి వాడు.. నిజం బయటకు రావాలి.. సుమలత కామెంట్స్

0
30
దర్శన్ నాకు పెద్ద కొడుకులాంటి వాడు..

నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కుటుంబానికి దర్శన్ సన్నిహితుడు అన్న విషయం చాలా మందికి తెలుసు.  అయితే రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అయిన తర్వాత సుమలత అంబరీష్ స్పందించలేదు. ఇప్పటికే చాలా మంది దీన్ని పై స్పందించారు. కొంతమంది దర్శన్ కు సపోర్ట్ చేస్తుంటే.. మరికొంత మంది దర్శన్ ను తప్పుబడుతున్నారు. సుమలత అంబరీష్ దర్శన్ కేసు పై మాట్లాడకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దర్శన్ అరెస్టుపై సుమలత తాజాగా స్పందించారు. దీని పై ఓ సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు సుమలత.

అందరికీ నమస్కారం.. 44 ఏళ్లుగా నటిగా, కళాకారిణిగా, గత 5 ఏళ్లుగా ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నాను. అలాగే, ఒక నటిగా.. భార్యగా, తల్లిగా, పార్లమెంటేరియన్‌గా అలాగే ఓ వ్యక్తిగా నా జీవితంలో ప్రతి బాధ్యతను నేను సీరియస్ గా తీసుకున్నాను. సమాజంలో బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎలాంటి వాస్తవాలు లేదా సమాచారం లేకుండా నిర్లక్ష్యంగా, అనవసరంగా, బాధ్యతారాహిత్య ప్రకటనలు చేయలేను. ఈ రోజు నేను కొన్ని విషయాలను స్పష్టం చేయడానికి, నా ఆలోచనలు, బాధలను పంచుకోవడానికి పోస్ట్ చేస్తున్నాను.. ఎందుకంటే నేను మీడియాలో లేదా సోషల్ మీడియాలో ఊహాగానాలను ప్రోత్సహించకూడదనుకుంటున్నాను. నా కామెంట్స్ అభిమానులలో ఎటువంటి గందరగోళాన్ని కలిగించకూడదు.

కొడుకును, భర్తను కోల్పోయిన హృదయవిదారకమైన రేణుకాస్వామి తల్లిదండ్రులకు, భార్యకు ముందుగా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని ఎదుర్కొనే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మన న్యాయ వ్యవస్థ నుంచి వారికి తగిన న్యాయం జరగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ సంఘటన నా హృదయాన్ని కలిచివేసింది. నేను చాలా రోజులపాటు దానిని అర్థం చేసుకోలేక షాక్, బాధతో ఉన్నాను. నా “నిశ్శబ్దం”పై వ్యాఖ్యానిస్తున్న కొంతమందికి నాకు, దర్శన్‌కు మధ్య ఉన్నరిలేషన్, అతని కుటుంబం, మేము సంవత్సరాలుగా పంచుకున్న బంధం అర్థం కావడం లేదు. అతను స్టార్, సూపర్ స్టార్ కాకముందు నాకు 25 సంవత్సరాలుగా తెలుసు. ఆ స్టార్ డమ్ కంటే, అతను నా కుటుంబంలో సభ్యుడు, నాకు కొడుకు లాంటివాడు. అంబరీష్‌ను ఎప్పుడూ తన తండ్రిగా భావించి.. నాకు తన తల్లి గౌరవం, స్థానం, కొడుకు ప్రేమను ఇచ్చారు.

ఏ తల్లి తన బిడ్డను ఇలాంటి పరిస్థితిలో చూసి తట్టుకోదు. దర్శన్ ప్రేమగల హృదయంతో చాలా శ్రద్ధగల, ఉదారమైన వ్యక్తి అని నాకు తెలుసు. జంతువుల పట్ల అతని ప్రేమ, సహాయ స్ఫూర్తి ఎల్లప్పుడూ అతని స్వభావంలో ఒక భాగం. ఈ పని చేసే వ్యక్తిత్వం దర్శన్‌ది కాదని నేను నమ్ముతున్నాను. ఈ కేసు కోర్టులో ఉన్నందున, ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్ చేయలేను. సోషల్ మీడియాలో దర్శన్‌తో పాటు అతని భార్య విజయలక్ష్మి, కొడుకును టార్గెట్ చేయడం చాలా అన్యాయం. దీంతో పాటు మిగతా నిందితుల నిరుపేద కుటుంబాలు కూడా అవస్థలు పడుతుండటం బాధాకరం. సోషల్ మీడియా వినియోగదారులు, పబ్లిక్ కామెంట్స్ ఇప్పటికే ఈ భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్న బాధితురాలి లేదా నిందితుల కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించాలి. విచారణ కొనసాగుతోంది, పోలీసులు వారి పనిని చేస్తున్నారు అలాగే మన న్యాయ వ్యవస్థపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ కేసులో దర్శన్ నిందితుడు అని ఇంకా ఏదీ రుజువు కాలేదు లేదా దోషిగా నిర్ధారించబడలేదు. ఈ విషయంలో ఇప్పటికే తీర్పు ఇవ్వడం , శిక్షించడం చట్టానికి సంబంధించినది మరెవరూ కాదు.

ఈ పరిస్థితిలో, నేను ఈ సమస్య నుంచి దూరంగా ఉండటం అసాధ్యం. ఇది నా స్వంత కుటుంబ సమస్య. ఇది వారి జీవితం లేదా కుటుంబ సౌఖ్యం, భద్రత, భవిష్యత్తుకు సంబంధించి చాలా తీవ్రమైన విషయం. మేమంతా బాధ పడుతున్నాం. సినిమా పరిశ్రమ అస్తవ్యస్తంగా ఉంది. ఆయన సినిమా నిర్మాణాలపైనే వేలాది మంది జీవనోపాధి ఆధారపడి ఉంది. దీన్ని ఎదుర్కోవడం ఎవరికీ అంత సులభం కాదు. నిందించబడడం అంటే అతను దోషి అని అర్థం కాదని గుర్తుంచుకోండి. చట్టబద్ధంగా తమను తాము రక్షించుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. దర్శన్ నన్ను మదర్ ఇండియా అని పిలుస్తాడు. నేను జీవించి ఉన్నంత వరకు అతను నాకు పెద్ద కొడుకుగా ఉంటాడు. మా బంధం ఒకటి, దానిని ఏదీ మార్చదు. నిజం బయటకు రావాలని, అందరికీ న్యాయం జరగాలని వారి తల్లిగా నేను నిరంతరం భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారు తమను తాము నిర్దోషులుగా నిరూపించుకుని బయటకు వచ్చి చిత్రీకరణ, సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. దర్శన్ అభిమానులకు హృదయపూర్వక అభ్యర్థన, దయచేసి ప్రశాంతంగా ఉండండి, ఈ తరుణంలో అతని కుటుంబం లేదా ప్రియమైన వారిని ప్రభావితం చేసే ఎలాంటి ప్రతికూలతతో ప్రకటనలు చేయవద్దు. మనలో ఎవరూ చట్టానికి అతీతులు కాదు మరియు మనం దానిని గౌరవించాలి.. ఓపికగా వేచి ఉండాలి. మంచి సమయాలు తిరిగి రావాలని ప్రార్థించండి. మన న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచండి. భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండండి. అంతా బాగానే ఉంటుంది అంతా మంచి జరుగుతుంది. సత్యమేవ జయతే. అని రాసుకొచ్చారు సుమలత.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here